దేశంలో ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రాలు ఇవే?

Purushottham Vinay
ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం వల్ల ఆ రాష్ట్రం చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. అయితే ఆ ప్రత్యేక హోదా రావటం అనేది చాలా కష్టం. ఎందుకంటే అభివృద్ధి చెందని ఇంకా బాగా వెనకబడిన రాష్ట్రాలకు మాత్రమే ఈ ప్రత్యేక హోదా అనేది వస్తుంది. ఇక మన దేశంలో ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి? అవేమిటో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.ప్రస్తుతం మన భారత దేశంలోని 11 రాష్ట్రాలు ప్రత్యేక రాష్ట్ర హోదాని పొందడం జరిగింది.అయితే వీటిలో ఆరు ఈశాన్య రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఆర్టికల్ 371(A)లో నాగాలాండ్‌ రాష్ట్రానికి ప్రత్యేక నిబంధన చేయబడింది, మత-సామాజిక సంప్రదాయాలు, సాంప్రదాయ చట్టం, నాగా చట్టాలకు అనుగుణంగా, సివిల్, క్రిమినల్ విషయాలు, హక్కులు ఇంకా అలాగే భూమి బదిలీకి సంబంధించిన నిర్ణయాలను భారత పార్లమెంటు తీసుకోవచ్చు. ఇవి మినహా ఇతర వనరులు ఏవీ కూడా కేంద్రానికి వర్తించడం అనేది జరగదు. అయితే, ఈ చర్యను మాత్రం రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన తర్వాత మాత్రమే అమలు చేయవచ్చు.


ప్రత్యేక నిబంధన ప్రకారం, తెలుస్తున్న విషయం ఏమిటంటే.. నాగాలాండ్‌ రాష్ట్రంలోని భూమి, స్థానిక వనరులు ప్రభుత్వానికి చెందినవి కావు. అవి కేవలం అక్కడి ప్రజలకు సంబంధించినవిగా మాత్రమే పరిగణించబడతాయి. ఇంకా అదే విధంగా ఆర్టికల్ 371 (జి) ప్రకారం మిజోరం  రాష్ట్రం కూడా ప్రత్యేక హోదాను పొందడం జరిగింది. మిజోరం రాష్ట్రం యొక్క ప్రజల చట్టపరమైన నిర్ణయాలు ఇంకా అలాగే వారి సంప్రదాయాలపై పార్లమెంటు చేసే ఏ చట్టమైనా, ఏ నిర్ణయమైనా రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత మాత్రమే అమలు అవ్వడం జరుగుతుంది. ఇంకా అదే విధంగా, అస్సాం రాష్ట్రానికి ఆర్టికల్ 371 (బి), మణిపూర్‌ రాష్ట్రానికి ఆర్టికల్ 371 (సి) ప్రత్యేక కేటాయింపులని చేయడం జరిగింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 371(F), సిక్కిం ఇంకా అలాగే అరుణాచల్ ప్రదేశ్‌లకు 371 (H) ప్రత్యేక హోదాను కల్పిస్తున్నాయి. ఇంకా  త్రిపుర, తెలంగాణ, ఉత్తరాఖండ్, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రలకి కూడా ప్రత్యేక హోదాలు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: