ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి కలిగే లాభాలేమిటి?

Purushottham Vinay
ప్రత్యేక రాష్ట్ర హోదా అనేది రాష్ట్ర ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడుతుంది. ఇంకా ఇది కాకుండా, రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వడానికి జాతీయ అభివృద్ధి మండలి కొన్ని  రూపొందించిన ప్రమాణాల ప్రకారం  ఒక రాష్ట్రానికి ఉన్న వనరులు ఏమిటి, అక్కడి తలసరి ఆదాయం ఎంత, రాష్ట్ర ఆదాయ వనరులు ఏమిటి అనే అంశాలను దృష్టిలో ఉంచుకుంటారు. గిరిజన జనాభా, అటవీ ప్రాంతం, ఎడారి భూములు, జనసాంద్రత ఇంకా వ్యవసాయానికి అననుకూల ప్రదేశం, అంతరాష్ట్ర సరిహద్దుకు సమీపంలో ఉన్న రాష్ట్రాలకు ప్రత్యేక హోదాని ఇస్తారు.ఆర్టికల్ 371 ద్వారా, రాష్ట్రాలకు ప్రత్యేక నిబంధనలనేవి చేయబడ్డాయి. అందువల్ల స్థానిక ప్రజల హక్కులు రక్షించబడతాయి. ప్రత్యేక రాష్ట్ర హోదా పొందినప్పుడు, రాష్ట్రానికి ప్రత్యేక మినహాయింపులనేవి ఉంటాయి. ఇంకా అలాగే ప్రత్యేక గ్రాంట్లు కూడా లభిస్తాయి. దేశంలో ప్రణాళికా సంఘం ఉన్న సమయంలో ఈ రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ మొత్తం ప్రణాళిక వ్యయంలో దాదాపు 30 శాతం పొందేవి.ఇక ప్రత్యేక రాష్ట్రాలకు కూడా ఈ డబ్బుని ఖర్చు చేసే స్వేచ్ఛ ఉండేది. కేంద్రం ఇచ్చిన డబ్బుని కనుక ఒక ఆర్థిక సంవత్సరంలో పూర్తిగా ఖర్చు చేయకపోతే వచ్చే ఆర్థిక సంవత్సరానికి వాడుకునే వెసులుబాటు కూడా కల్పిస్తుంది. సాధారణంగా ఒక ఆర్థిక సంవత్సరంలో విడుదలైన మొత్తం నిధులని కనుక ఖర్చు చేయకపోతే అవి లాప్స్ అవుతాయి. అదే ప్రత్యేక హోదా కల్గిన రాష్ట్రాలకు అయితే ఈ నిబంధన నుంచి మినహాయింపనేది ఉంటుంది. అంటే ప్రతి సంవత్సరం కూడా డబ్బులు వాడుకోవచ్చు.


ఇంకా కొత్త నిధులని కూడా తీసుకోవచ్చు.అలాగే నిధులు మాత్రమే కాకుండా.. ప్రత్యేక రాష్ట్ర హోదా వచ్చిన తర్వాత అక్కడ అమలు చేస్తున్న కేంద్ర పథకాల్లో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం కూడా పెరగడం జరుగుతుంది. ఇంకా రాష్ట్రంలోని పరిశ్రమలకు పన్ను మినహాయింపు లభిస్తుంది. పైగా పరిశ్రమలు నెలకొల్పాలంటే ప్రత్యేక రాయితీలు ఇస్తుంది. ఇంకా అదనుగా గ్రాంట్లు కూడా అందిస్తుంది ప్రభుత్వం. ఇందులో ఎక్సైజ్, కస్టమ్ సుంకాలనేవి కూడా ఉంటాయి. వాటిలో కూడా కొంత మినహాయింపు అనేది ఉంటుంది. పైగా పరిశ్రమలు నెలకొల్పిన వారికి అందించే రుణాల్లో 90శాతం గ్రాంట్ల రూపంలో ఇంకా 10శాతం మాత్రమే రుణాల రూపంలో ఇస్తారు.పైగా ఆ రుణాలకు కూడా ఎలాంటి వడ్డీ వసూలు చేయరు. అందువల్ల అక్కడ అభివృద్ధి అనేది బాగా వేగవంతం అవుతుంది. ఇప్పుడు టీడీపీ, జేడీయూలు ఆంధ్రప్రదేశ్‌ ఇంకా బీహార్‌ల రాష్ట్రాలకు ప్రత్యేక రాష్ట్ర హోదాపై పట్టుబట్టినట్లయితే, కేంద్ర ప్రభుత్వం రాబోయే బడ్జెట్‌లో వారికి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించవచ్చు. ఈ ప్రత్యేక ప్యాకేజీ రూ.లక్ష కోట్ల దాకా ఉంటుందని తెలుస్తుంది. అయితే, ఈ మొత్తాన్ని ఒకే మొత్తంలో కానీ ఏడాది పొడవునా కానీ వివిధ వాయిదాలలో విడుదల చేయవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: