ప్రత్యేక హోదా అంటే ఏమిటి?

Purushottham Vinay
ప్రస్తుతం ప్రత్యేక హోదా అంశం మరోసారి తెరపైకి వచ్చి హాట్ టాపిక్ అవుతుంది. ఇంతకూ ఈ ప్రత్యేక రాష్ట్ర హోదా అంటే ఏమిటి? ఇంకా అలాగే ప్రత్యేక ప్యాకేజీ అంటే ఏమిటో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో రెండవసారి అధికారంలో ఉన్న సమయంలో, nda ప్రభుత్వం జమ్మూ, కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370 లోని కొన్ని నిబంధనలను రద్దు చేయడం జరిగింది. ఈ నిబంధనల ద్వారా రాష్ట్రానికి కొన్ని ప్రత్యేక అధికారాలనేవి లభించాయి.ఇంకా అలాగే రాజ్యాంగంలోని ఆర్టికల్ 371 ఉంది. ఇక ఈ ఆర్టికల్ ద్వారా ఏ రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులు జరిగితే, ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చినట్లే అని తెలుస్తుంది. 1969 వ సంవత్సరంలో తొలిసారిగా ఐదవ ఆర్థిక సంఘం గాడ్గిల్ ఫార్ములా ఆధారంగా మూడు రాష్ట్రాలైన జమ్మూ-కశ్మీర్, అస్సాం, నాగాలాండ్‌లకు ప్రత్యేక హోదా కల్పించింది. ఈ మూడు రాష్ట్రాల సామాజిక, ఆర్థిక ఇంకా భౌగోళిక వెనుకబాటు ఆధారంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక రాష్ట్రానికి ప్రత్యేక రాష్ట్ర హోదాని ఇవ్వడం వల్ల ఆ రాష్ట్రం తన వెనుకబాటుతనాన్ని అధిగమించి అభివృద్ది చెందిన రాష్ట్రంగా ఎదుగుదలకు తోడ్పడుతుంది.


ఇంకా ఇది కాకుండా, రాష్ట్రాలకు ప్రత్యేక హోదాని ఇవ్వడానికి గాను జాతీయ అభివృద్ధి మండలి కొన్ని ప్రమాణాలను కూడా రూపొందించింది. వీటిలో ఒక రాష్ట్రానికి ఉన్న వనరులు ఏమిటి?  అక్కడి తలసరి ఆదాయం ఎంత? రాష్ట్ర ఆదాయ వనరులు ఏమిటి? అనే అంశాలను దృష్టిలో పెట్టుకుంటారు. గిరిజన జనాభా, అటవీ ప్రాంతం, ఎడారి భూములు, జనసాంద్రత, వ్యవసాయానికి అననుకూల ప్రదేశం ఇంకా అంతరాష్ట్ర సరిహద్దుకు సమీపంలో ఉన్న రాష్ట్రాలకు ప్రత్యేక హోదాని ఇవ్వొచ్చు.విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ బాగా వెనకబడిపోయింది.గతంలో జరిగిన కొన్ని రాజకీయ సమీకరణాల దృష్ట్యా, కేంద్రంలో తమకు సరిపడా బలంలేని నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకహోదా అంశాన్ని చాలా మంది నేతలు కూడా పక్కన పెట్టేశారు. అయితే తాజాగా వచ్చిన ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి అధికారం చేపట్టాలంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ నుంచి పార్లమెంటుకు ఎంపికైన అభ్యర్థుల మద్దతు తప్పనిసరిగా ఉండాలి. దీంతో ప్రస్తుతం ప్రత్యేక హోదా అంశం మరోసారి తెరపైకి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: