చంద్ర బాబు: ఈ గొప్ప అవకాశాన్ని ఆంధ్ర కోసం ఉపయోగిస్తారా..?

Divya
ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన ఎన్నికలలో భాగంగా చంద్రబాబు భారీ ఘనవిజయాన్ని అందుకున్నారు.. ముఖ్యంగా బీజేపీ, టిడిపి, జనసేన పార్టీ కూటమిగా అందుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం మీద 21 మంది ఎమ్మెల్యేలు బిజెపిలో ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యలుగా ఉన్నారు.. అలాగే తెలంగాణ నుంచి బిజెపి ఎనిమిది మంది ఎంపీలు కూడా ఉన్నారు.పదేళ్ల తర్వాత కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎంపీలు చాలా ముఖ్యమని తేలిపోయారు. మరి ఇలాంటి అమూల్యమైన అవకాశాన్ని నాయకులు ఎలా ఉపయోగించుకుంటారనే విషయం పైన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టిపడింది..

ముఖ్యంగా రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్నో సహాయ సహకారాలు అందించాల్సి ఉండగా వాటిని ఇప్పటివరకు అందించలేదు మరి కూటమిలో భాగంగా చంద్రబాబు నాయుడు అడిగిమరీ వాటిని తీసుకు వస్తారా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు అద్భుత అవకాశం దక్కింది ఎన్నికలలో టిడిపి పార్టీకి ఊహించని విజయాన్ని అందించిన కూడా రాజధాని అభివృద్ధి ప్రాజెక్టులు ప్రత్యేక హోదా ఇలాంటి అంశాలను కూడా డిమాండ్ చేసిన నెరవేర్చలేదు.

ఈసారి టిడిపికి దక్కిన గెలుపు అనూహ్యమైనది. ఈ ఘనవిజయం ఆంధ్రప్రదేశ్ పాలన అందించడానికి కాదు కేంద్రంలో కూడా తన హవా చూపించడానికి అని చెప్పవచ్చు. ఈ అవకాశంతో చంద్ర బాబు ఏవైనా ఆంధ్రప్రదేశ్ కి అద్భుతాలు సృష్టిస్తారా అనే విషయం పైన అందరూ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.అయితే 2014లో మోడీ నెత్తురుత్వంలో గెలిచినప్పటికీ మిత్రపక్షలతో పని లేకుండా పోయింది దీంతో కేంద్రం పైన ఒత్తిడి తెచ్చి రాష్ట్ర ప్రయోజనాలు సాధించే స్థాయి కూడా అప్పటికి టిడిపి ప్రభుత్వం చేయలేక పోయింది. ఇక 2019లో వైసీపీ ప్రభుత్వం కూడా భారీ విజయాన్ని అందుకుంది ఆ పార్టీకి 22 ఎంపీ స్థానాలు లభించాయి. బిజెపికి కూడా సొంతంగా 33 సీట్లు రావడంతో అప్పుడు కూడా మిత్రపక్షాలు అవసరం లేకుండా అయ్యింది. కానీ 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో కూటమి భారీ విజయాన్ని అందుకుంది. మరి ఇప్పుడు చంద్రబాబు ప్రత్యేక హోదా మీద ఒత్తిడి తెస్తారా పోలవరం నిర్మాణానికి సహకరిస్తారా విశాఖ ఉక్కు ప్రైవేటుకరణం కాకుండా ఆపుతారా అనే విషయం పైన ఏపీ ఓటర్లు ఆలోచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: