వారెవ్వా: బిజెపి కి జై కొట్టిన ఆంధ్రా ముస్లిములు, కలా - ఈవీఎం మాయా ?

Divya
జగన్ ప్రభుత్వంలో ఉండేటువంటి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంతటి దారుణమైన ఓటమికి అంత చిక్కని రహస్యాలు ఏంటివో ఎక్కడ చిక్కడం లేదు.. వ్యతిరేకత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి ఎక్కడ కనిపించలేదు. ముఖ్యంగా టిడిపి జనసేన బిజెపి పొత్తుతో పెట్టుకుంది. ముస్లిం ఓటు బ్యాంకు ఉన్నవాళ్లు ముస్లింల ఓట్లు బిజెపికి వ్యతిరేకంగా ఓటు వేస్తారన్నది ఉన్న వాస్తవమే.. దాని ప్రకారం బిజెపి కీలకంగా ఉన్న కూటమికి కూడా వ్యతిరేకంగా ఉండాలన్నది కూడా వాస్తవమే.. కానీ ఎక్కడ కూడా అవేమీ కనిపించడం లేదు.

బిజెపి పార్టీని ప్రేమించే అంత వ్యతిరేకత జగన్ మీద ఏమున్నది అన్నది ఇప్పుడు అంత చిక్కని ప్రశ్న.. కర్నూలులో లక్ష ఐదువెలు ఉన్న ముస్లిం ఓటు బ్యాంకు ఓడిపోయారు.. కడపలో 105,000 ఓట్లు టౌన్ లో ఉన్నవి కడప అసెంబ్లీ కూడా ఓడిపోయింది. గుంటూరు ఈస్ట్ లో 86,000 మంది ముస్లింలు ఉండగా.. ఓడిపోయింది. విజయవాడ వెస్ట్ 83,000 మంది ఉంటారు.. ఓడిపోయారు. రాయచోటి 80000 మంది పైగా ఉండగా అక్కడ కూడా ఓడిపోయారు. నంద్యాల 70 వేల మంది పైగా ఉన్నప్పటికీ అక్కడ కూడా ఓడిపోయారు. హిందూపురంలో కూడా 70000 మంది ఉండగా ఓడిపోయారు. మదనపల్లి లో కూడా 60000 మంది ఉండగా ఓడిపోయారు. కదిరి 60000 మంది ఉండగా ఓడిపోయారు. ముఖ్యంగా కదిరిలో ముస్లిం అధినేతనే నిలబెట్టారు వైసీపీ పార్టీ కానీ అక్కడ కూడా ఓడిపోయారు.

50వేల కంటే పైన ఉన్న ముస్లిం ఓట్లలో వైసిపి పార్టీ ఓడిపోవడం ఇక్కడ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. బిజెపి ఉన్న కూటమే గెలిచింది.. బిజెపి పార్టీని ప్రేమించే అంత వ్యతిరేకత జగన్ మీద ఉందా అనేది ఇక్కడ ప్రశ్నగా మారింది.. ఒకవేళ ఉంటే ఎందుకని కూడా వైసిపి పార్టీ నేతలు అడుగుతున్నారు.. బిజెపి ఉన్న కూడని ముస్లింలకు చేసే వాటికంటే జగన్ ఇంకా వరస్ట్ గా చేశారా.... అయితే మరి కొంతమంది నేతలు బిజెపి పార్టీకి జై కొట్టిన ఆంధ్ర ముస్లింలు ఇది కలనా లేకపోతే ఈవీఎంలా మాయ అన్నట్టుగా తెలియజేస్తున్నారు. ఇప్పటికే చాలామంది కూడా ఈవీఎం రిమోట్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చేశారని వాదనలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: