టీడీపీ విక్టరీ: జగన్ కోలుకోవాలంటే దశాబ్దం పడుతుందట?

Purushottham Vinay
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలో వైసీపీ చాలా దారుణాతి దారుణమైన పరాజయాన్ని ముటగట్టుకుంది. గత ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ఏకంగా 153 స్థానాల్లో ఘన విజయం సాధించిన వైసీపీ ఈ సారి మాత్రం చాలా దారుణంగా కేవలం 11 సీట్లకే పరిమితమైంది.వైసీపీ ఓటమి సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగినా మరీ ఈ స్థాయిలో పడిపోతుందని ఎవరూ అంచనా వేయలేకపోయారు. దీంతో వైసీపీ మళ్లీ పూర్వవైభవం పొందుతుందా? ఈ దారుణ దెబ్బ నుంచి ఆ పార్టీ కోలుకోవడం ఇక కష్టమేనా? అన్న చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. 


గతంలో 1994లో జరిగిన ఏపీ ఎన్నికల్లో కూడా నాటి అధికార కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి దారుణ పరాజయమే దక్కింది. 294 స్థానాల్లో బరిలోకి దిగిన ఆ పార్టీకి కేవలం 26 సీట్లలో మాత్రమే గెలిచింది. అంటే దాదాపు 9 శాతం సీట్లను మాత్రమే గెలుచుకుంది. అంటే.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోవడంతో ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 175 అసెంబ్లీ సీట్లు మాత్రమే ఉన్నాయి. 294లో 26 సీట్లు అంటే.. 175కు లెక్కిస్తే దాదాపు 16 గెలిచినట్లు లెక్క తెలుస్తుంది. ఇప్పుడు వైసీపీ కేవలం 7 శాతం సీట్లను గెలుచుకుంది. అయితే.. 1994లో ఆ దారుణమైన పరాజయం తర్వాత కాంగ్రెస్ పార్టీ తిరిగి కోలుకోవడానికి ఏకంగా పదేళ్ల సమయం పట్టింది.


2004 వ సంవత్సరంలో రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో ఎన్నికలకు వెళ్లిన ఆ పార్టీ గెలిచి అధికార పీఠం దక్కించుకుంది.అయితే.. అప్పుడు కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉండడం గమనార్హం. ఎన్టీఆర్ పై ఎమ్మెల్యేల తిరుగుబాటు తర్వాత 1 సెప్టెంబర్ 1995న సీఎం పదవిని చేపట్టిన చంద్రబాబు నాయుడు.. 2004 ఏప్రిల్ దాకా ఆ పదవిలో కొనసాగారు. మధ్యలో 1999లో వచ్చిన ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విశ్వప్రయత్నాలు చేసినా విజయం అందుకోలేకపోయింది. రాజశేఖర్ రెడ్డి గారి సారథ్యంలో ఎన్నికలకు వెళ్లిన ఆ పార్టీకి 91 సీట్లు దక్కాయి.ఇక 180 సీట్లలో విజయం సాధించిన టీడీపీ వరుసగా రెండో సారి అధికారాన్ని దక్కించుకుంది.


1999 ఎన్నికల్లో పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రాజశేఖర్ రెడ్డి సీఎల్పీ నేతగా ఎన్నికయ్యారు. ఐదేళ్ల నుంచి ప్రభుత్వంపై అలుపెరగని పోరాటం, పాదయాత్ర ద్వారా ఆయన కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో విజయతీరాలకు చేర్చారు. ప్రస్తుతం రాజశేఖర్ రెడ్డి  కుమారుడు జగన్ ప్రతిపక్షంలో ఉండగా.. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కానున్నారు. ఈ దారుణమైన పరాజయం నుంచి కోలుకుని వైసీపీ మళ్లీ ఐదేళ్లలో పూర్వవైభవం దక్కించుకుంటుందా? లేక గతంలో కాంగ్రెస్ పార్టీ లాగానే వైసీపీ అధికారంలోకి రావడానికి పదేళ్లు పడుతుందా? లేక ఆ పార్టీ ఇంకా కోలుకోలేదా? అనే అంశాలపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా 10 ఏళ్ల సమయం పడుతుందని అంటున్నారు. అది కూడా చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రానికి ఏమి చెయ్యలేకపోతేనే వైసీపీ నిలదొక్కుకుంటుందని నెటిజన్స్ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: