కాబోయే సీఎంను కలిసిన సీఎస్.. కారణం అదే..?

Divya
ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీన ఫలితాలు వెలువడగా.. ఇందులో టిడిపి పార్టీ అఖండ విజయాన్ని అందుకుంది.. వైసీపీ పార్టీ ఘోరమైన పరాజయాన్ని మూట కట్టుకుంది. ముఖ్యంగా కూటమిలో భాగంగా టిడిపి, జనసేన ,బిజెపి పార్టీలు మూకుమ్మడిగా 164 సీట్లను కైవసం చేసుకున్నాయి. ఇప్పటికే చంద్రబాబు నాయుడు 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు టిడిపి నేతలు ప్రకటించారు అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లు వార్తలు కూడా వెలువడ్డాయి.. కానీ కేంద్రంలో అదే రోజున ప్రధానమంత్రి గా మూడవ సారీ నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో చంద్రబాబునాయుడు ఆరోజు అక్కడికి హాజరుకానున్నారు.. అందుకే ఆంధ్రప్రదేశ్లో 14వ తేదీ చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. ఇప్పటికే పలువురు అధికారులు సెలవులపై వెళ్లగా ఇప్పుడు సీఎస్‌ జవహర్‌ రెడ్డి కూడా సెలవుపై వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు అధికారులకు సమాచారం ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ముఖ్యమంత్రిగా త్వరలో ప్రమాణం చేయనున్న చంద్రబాబును బుధవారం కలిసిన సీఎస్‌ జవహార్‌ రెడ్డి ఈ విషయాన్ని చెప్పినట్టు తెలుస్తోందీ. దీంతో టీడీపీ నేతలు ఆ రోజున జరిగేటువంటి సంబరాలకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది.
ఇప్పటికే మినిస్టర్ పదవులను కూడా ఫిక్స్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం హోమ్ మినిస్టర్ పదవిని కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. నారా లోకేష్ కు ఐటీతోపాటు మున్సిపాలిటీకి సంబంధించిన పదవి ఇచ్చినట్లుగా సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు టిడిపి ప్రభుత్వం.. అలాగే మేనిఫెస్టోలో ఉండేటువంటి వాటిని అమలు చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం అంటూ కూడా చంద్రబాబు నాయుడు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. పవన్ కళ్యాణ్ కూడా చెప్పిన వాగ్దానాలన్నిటిని నెరవేర్చడం కోసమే తాను కూటమితో జత కట్టానని కూడా వెల్లడించారు.

జనసేన పార్టీ వందకు వందశాతం పోటీ చేసిన సీట్లను గెలుచుకుంది.. ఇది రాబోయే రోజుల్లో తమ పార్టీని మరింత బలంగా చేకూర్చేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు పవన్ కళ్యాణ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: