చంద్రబాబు టీం : జనసేన నుండి పవన్ తర్వాత మంత్రి అవకాశం అతనికే..?

Pulgam Srinivas
2024 కు కాను సంబంధించిన అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు జూన్ 4 వ తేదీన విడుదల అయ్యాయి. ఈ ఎన్నికలలో అనూహ్యమైన ఫలితాలు విడుదల అయ్యాయి. 2019 ఎన్నికలలో ఏకంగా 151 అసెంబ్లీ స్థానాలను దక్కించుకొని తిరుగులేని పార్టీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎదిగిన వైసిపి ఈ సారి కనీసం 70 లేదా 80 స్థానాలను అయిన దక్కించుకుంటా అంది అని ఎంతో మంది రాజకీయ విశ్లేషకులు , జనాలు అనుకున్నారు.

కానీ రిజల్ట్ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వచ్చేసింది. వైసిపి పార్టీకి కేవలం 11 స్థానాలు మాత్రమే వచ్చాయి. ఇక మిగతావన్నీ కూడా కూటమి ఎగరేసికెళ్ళింది. ఇక ఈ సారి తెలుగు దేశం , జనసేన , బిజెపి మూడు పార్టీలు కలిపి పొత్తులో భాగంగా పోటీ చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా జనసేన పార్టీకి 21 అసెంబ్లీ , 2 పార్లమెంట్ స్థానాలు ఇచ్చారు. ఇక వీరు 21 అసెంబ్లీ , 2 పార్లమెంటు స్థానాలలో కూడా గెలుపొంది 100% విజయాన్ని సంపాదించారు. చంద్రబాబు మంత్రి వర్గంలో జనసేన నుండి దాదాపు ముగ్గురు అయినా మంత్రులు అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా ఎలాగో జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ కు ఒక మంత్రి పదవి ఉంటుంది. ఈయనకు కీలక మంత్రి పదవి ఉండే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఆ తర్వాత ఈ పార్టీలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి అయినటువంటి నాదెండ్ల మనోహర్ కు మరో మంత్రి పదవి ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈయనకు కీలకమైన మంత్ర పదవి కాకపోయినా మంచి గుర్తింపు కలిగిన మంత్రి పదవి దక్కి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మనోహర్ ఈ సారి అసెంబ్లీ ఎన్నికలలో తెనాలి శాసనసభ నియోజకవర్గం నుండి బరిలోకి దిగి భారీ విజయాన్ని అందుకున్నాడు. అలాగే ఈయన జనసేన పార్టీలో కీలక నేతగా కొనసాగుతున్నాడు. దానితో ఈయనకు కూడా చంద్రబాబు మంత్రివర్గం లో మంచి మంత్రి పదవి పెద్దకే అవకాశం ఉన్నట్లు చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: