గెలిపిస్తూనే.. కూటమికి ఏపీ ప్రజలు వార్నింగ్ ఇచ్చారా?

praveen
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ ప్రజలు కూటమికి 164 సీట్లు కట్టబెట్టి అఖండ విజయాన్ని అప్పజెప్పారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అప్పటి వరకు అధికారంలో ఉన్న వైసిపి పార్టీని కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం చేశారు. ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటలు సైతం బద్దలు కొట్టుకుంటూ కూటమి పార్టీ తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది. ఇక మరికొన్ని రోజుల్లో అటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది అన్న విషయం తెలిసిందే.

 అయితే వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా  కూటమి కూడా మేనిఫెస్టోలో చేర్చింది. అంతేకాదు వైసిపి ప్రభుత్వం ఇస్తాము అన్నదానికంటే ఎక్కువ మొత్తంలోనే ఆయా సంక్షేమ పథకాల ద్వారా డబ్బులు అందజేస్తామని కూటమి తెలిపింది. అయితే జగన్ పై ఉన్న వ్యతిరేకత కూటమి ఇచ్చిన హామీలు ఇక వారి గెలుపుకు కారణమయ్యాయి అని చెప్పాలి. అయితే ఇలా 164 సీట్లలో గెలిపిస్తూనే చంద్రబాబు ప్రభుత్వానికి ఏపీ ప్రజలు ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చేశారు అన్న విషయం రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

 మునుపెన్నడూ లేని విధంగా సంక్షేమ పథకాలను తీసుకువచ్చిన జగన్ ఏకంగా ప్రతి ఒక్కరికి తమ పథకాల ద్వారా లబ్ధి చేకూరేలా చేశారు. దాదాపుగా ఇచ్చిన హామీలలో 95% కు పైగానే అమలు చేశామని చెప్పకనే చెప్పారు. ఇలా పథకాల రూపంలో వైసిపి ఒక రకంగా ప్రజలకు లక్షల కోట్ల రూపాయలు పంచింది. అయినప్పటికీ వైసీపీని ప్రజలు నమ్మలేదు  కూటమికి 164 సీట్లు కట్టబెట్టారు. ఈ విజయాన్ని అందించడమే కాదు గట్టి హెచ్చరిక కూడా పంపారు. పథకాలు అందిస్తే చాలు ప్రజలు ఓట్లు వేస్తారని కలలో కూడా అనుకోవద్దు అనే విషయాన్ని అర్థమయ్యేలా చేశారు. ఈ క్రమంలోనే అభివృద్ధికి పెద్దపీట వేస్తామని కూటమి ఇచ్చిన హామీకి ప్రజలు బ్రహ్మరథం పడ్డారు. అదే సమయంలోవైసిపి కంటే ఎక్కువ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినప్పటికీ.. ఒక వైపు సంపాదన సృష్టిస్తూనేమి.. సంక్షేమ పథకాలను పంచుతాము అని చెప్పింది కూటమి. ఇక ఇదే విషయాన్ని నమ్మారు ప్రజలు. ఒకవేళ కూటమి కూడా ఇలా అప్పులు తెచ్చి సంక్షేమ పథకాలను పంచితే మాత్రం ఆ పార్టీకి కూడా తర్వాతి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ లాంటి ఘోర పరాజయం తప్పదు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: