టీడీపీ: ముందు అనుకున్నట్లు కీలక పదవులు వీరికే?

Purushottham Vinay
•టీడీపీ మంత్రులపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ


•ముందుగా పవన్, బాల కృష్ణలకు మంత్రి పదవులు


అమరావతి - ఇండియా హెరాల్డ్ : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు రానే వచ్చాయి. గత కొంతకాలం నుంచి ఎంతో ఉత్కంఠగా సాగినటువంటి ఫలితాలు తెలుగు దేశం పార్టీకి చాలా ఊరటనిచ్చాయి.ఆంధ్రప్రదేశ్ ఫలితాలు కనుక చూస్తే మాత్రం బండ్లు ఓడలవుతాయి ఓడలు బండ్లు అవుతాయి అనేది ఖచ్చితంగా నిజం అయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎవరు గెలిచినా కూడా చాలా తక్కువ మెజారిటీతో కేవలం 80 నుంచి 85 సీట్లతో వస్తారని భావించారు. కానీ అసలు ఎవరూ ఊహించని విధంగా తెలుగు దేశం పార్టీ కూటమి అత్యధిక స్థానాలని కైవసం చేసుకొని విజయం సాధించింది. ఇక వైసిపి అయితే మహా దారుణంగా కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. దీంతో తెలుగుదేశం పార్టీ కూటమి ఫ్యాన్స్, నాయకులంతా కూడా ఆకాశాన్ని అంటేలా గెలుపు సంబరాలు చేసుకుంటున్నారు.


ఇంకా అంతే కాకుండా ఇంకో రెండు మూడు రోజుల్లో చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ తరుణంలోనే చంద్రబాబు నాయుడుతో మంత్రివర్గ కూర్పు కూడా ఉంటుందని,మరి ఆయనతో ప్రమాణస్వీకారం ఏ ఏ మంత్రులు చేస్తారనేది చాలా ఆసక్తికరంగా మారింది. తాజాగా అందిన సమాచారం ప్రకారం ముందుగా అనుకున్నట్లు గానే చంద్రబాబు నాయుడుతో పాటు గంటా శ్రీనివాసరావు, అచ్చెన్నాయుడు ,పరిటాల సునీత, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, వర్మ లాంటి సీనియర్ నాయకులకు ముందుగా మంత్రి పదవులు ప్రకటిస్తారని సమాచారం తెలుస్తుంది. ఆ తర్వాత జిల్లాలు, సామాజిక వర్గాల వారీగా మంత్రి పదవులు ఇస్తారని సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. మరి మున్ముందు చూడాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలుగు దేశం పార్టీ హయాంలో ఎవరు మంత్రులవుతారనేది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: