జగన్ ను మళ్లీ భ్రమల్లోకి నెట్టే ప్రయత్నాలు .. ఓటమికి అసలు కారణాలివేనా?

Reddy P Rajasekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 21 లక్షల ఓట్లు తక్కువగా రావడం వల్ల వైసీపీకి దారుణ పరాజయం ఎదురైంది. ఏపీలో వైసీపీ ఓటమికి కారణాలేంటనే ప్రశ్నలకు వేర్వేరు కారణాలు వినిపిస్తున్నాయి. కొంతమంది వైసీపీ నేతలు వాలంటీర్ల వ్యవస్థ వల్లే ప్రజలకు నేతలకు మధ్య సంబంధాలు తెగిపోయాయని చెబుతున్నారు. ఎన్నికల ఫలితాలను చూసి వైసీపీ నేతల ఆవేదన అంతాఇంతా కాదు. ఏదో జరిగిందని అందుకే ఓటమిపాలయ్యామని వైసీపీ నేతలు చెబుతున్నారు.
 
ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే రాష్ట్రంలో ఓటమిపాలయ్యామని వైసీపీ నేతలు చెబుతుండగా ఈ ప్రయత్నాలు జగన్ ను మళ్లీ భ్రమల్లోకి నెట్టే ప్రయత్నాలు అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వైసీపీపై ఈ స్థాయిలో వ్యతిరేకత ఉందంటే ఈ వ్యతిరేకత గురించి వైసీపీ నేతల్లో కూడా ఒకింత అవగాహన ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోనే సీమలో వైసీపీకి వ్యతిరేకంగా ఫలితాలు రావడం హాట్ టాపిక్ అయింది.
 
అయితే ఆ సమయంలో టీచర్లు, గ్రాడ్యుయేట్లు తమకు వ్యతిరేకంగా ఉన్నారని భావించి ఆ తప్పులను వైసీపీ కప్పి పుచ్చుకునే ప్రయత్నం అయితే చేసింది. వైసీపీకి ఈ ఎన్నికల్లో 40 శాతం ఓట్లు వచ్చాయి. వైసీపీ మేనిఫెస్టో కంటే కూటమి మేనిఫెస్టో మెరుగ్గా ఉండటం ఆ పార్టీకి ప్లస్ అయిందని చెప్పవచ్చు. అయితే వైసీపీ తప్పులను తెలుసుకుని ముందడుగులు వేస్తే 2029లో ఫలితాలు మారే అవకాశం అయితే ఉంటుంది.
 
2019లో టీడీపీకి ఎలాంటి ఫలితం వచ్చిందో ఈ ఎన్నికల్లో వైసీపీకి అలాంటి ఫలితమే వచ్చింది. అయితే వచ్చే ఐదేళ్లలో పుంజుకుని వైసీపీ సంచలనాలు సృష్టించడం మరీ కష్టమైతే కాదని చెప్పవచ్చు. అయితే వైసీపీ గత ఐదేళ్లలో చేసిన తప్పులను తెలుసుకుని ఆ తప్పులు రిపీట్ కాకుండా జాగ్రత్త పడితే మాత్రమే ఆశించిన ఫలితాలను అయితే పొందే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. జగన్ పేదలకు అండగా నిలబడుతూ రాష్ట్రంలో వైసీపీకి పూర్వ వైభవం తీసుకొనిరావాలని కామెంట్లు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: