టీడీపీ గెలుపు: కల్కి నిర్మాత పిచ్చ హ్యాపీ! ఇక కాసుల వర్షమే?

Purushottham Vinay
రెబల్ స్టార్ ప్రభాస్ నాగ్ అశ్విన్ తో కల్కి సినిమాతో బాహుబలి రేంజ్లో భారీ హిట్టు కొట్టేందుకు పెద్ద ప్లానే వేశాడు. కల్కి సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా కల్కి 2898 ఏడి సినిమా ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా భాషల్లో హాలీవుడ్ లెవెల్ లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నా కొద్దీ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. కల్కి వరల్డ్ ఎలా ఉంటుంది.. అసలు కల్కి ఏం చేస్తాడు అన్నది శాంపిల్ గా కల్కి ప్రీల్యూడ్ తో చూపించాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. కల్కి యానిమేటెడ్ సీరీస్ చూసిన ఆడియన్స్ సినిమాపై ఒక అంచనాకు రావడం జరిగింది.ఈ కల్కి సినిమాను నాగ్ అశ్విన్ అంచనాలకు మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.కల్కి సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా మొదటి పార్ట్ అన్ని పాత్రలను పరిచయం చేయడం భైరవ లక్ష్యం పెట్టుకోవడం ఫస్ట్ పార్ట్ లో చూపిస్తారని సమాచారం తెలుస్తుంది. ఇక కల్కి 2898 ఏడి క్లైమాక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని సమాచారం తెలుస్తుంది.కల్కి సినిమా అంతా కూడా ఒక ఎత్తైతే.. చివరి అరగంట మాత్రం మరో ఎత్తని అంటున్నారు.

ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసే అద్భుతమైన విజువల్స్ తో కల్కి సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. ఈ మూవీ కోసం నాగ్ అశ్విన్ ఒక యానిమేషన్ కంపెనీనే రన్ చేస్తున్నాడని తెలుస్తుంది. కల్కి మూవీతో ప్రభాస్ హాలీవుడ్ రేంజ్ కి వెళ్తాడని అంటున్నారు. కల్కి యూనివర్స్ కు లీడ్ ఇస్తూ సెకండ్ పార్ట్ పై ఎంతో ఆసక్తి పెరిగేలా సస్పెన్స్ క్రియేట్ చేసి కల్కి ఫస్ట్ పార్ట్ ని ముగిస్తారట. ఈ మూవీ ట్రైలర్ ని జూన్ 7 న రిలీజ్ చెయ్యాలనుకున్నారు కానీ జూన్ 10 కి వాయిదా పడ్డట్టు తెలిసింది. ఇదిలా ఉంటే ఈ సినిమా నిర్మాత అశ్వినిదత్ చాలా హ్యాపీగా ఉన్నాడు. ఎందుకంటే వైసీపీ ఓడిపోయి టీడీపీ రూపంలో కొత్త గవర్నమెంట్ వచ్చేసింది. అందువల్ల ఇష్టం వచ్చినట్లు టికెట్ రేట్లు భారీగా పెంచుకోవచ్చు. భారీ ఈవెంట్లు, బెనిఫిట్ షోలు ప్లాన్ చేసుకోవచ్చు. 600 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు కాబట్టి టీడీపీ గవర్నమెంట్ లో ఈ సినిమా రిలీజ్ చేసి బాగా లాభ పడవచ్చని నిర్మాత అశ్వినిదత్ భావిస్తున్నాడు. ముందు నుంచి టీడీపీకి సపోర్ట్ చేసిన నిర్మాత ఇప్పుడు ఆ పార్టీ గెలుపు పట్ల పిచ్చ సంతోషంగా ఉన్నాడట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: