జక్కంపూడి : నా చివరి శ్వాస వరకు ఆయనతోనే ఉంటాను

frame జక్కంపూడి : నా చివరి శ్వాస వరకు ఆయనతోనే ఉంటాను

Veldandi Saikiran
సీఎం జగన్ మోహన్ రెడ్డి మంచివాడు నా చివరి శ్వాస వరకు ఆయనతోనే ఉంటాను అని పేర్కొన్నారు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. వైసీపీ పార్టీ ఓటమి చెందడంపై రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడారు. ధనంజయ రెడ్డి లాంటి చెత్త అధికారిని పెట్టుకోవడం వల్ల ఎమ్మెల్యేలు చాలా ఇబ్బంది పడ్డారని ఆరోపణలు చేశారు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. ధనంజయ రెడ్డి ఎమ్మెల్యేలను రేపు .. ఎల్లుండి అంటూ ఐదు సంవత్సరాల తరబడి తెప్పించుకున్నారని ఫైర్‌ అయ్యారు.
ధనుంజయ రెడ్డిని ముఖ్యమంత్రి గుడ్డి విశ్వాసంతో నమ్మారని ఆవేదన వ్యక్తం చేశారు రాజానగరం మాజీ ఎమ్మెల్యే  జక్కంపూడి  రాజా. ప్రజలకు సేవ చేయడం కోసం ధనుంజయ రెడ్డి కాళ్ల చుట్టూ తిరిగేవాళ్లమని పేర్కొన్నారు. సచివాలయంలో అధికారులు సరిగా స్పందించేవారు కాదన్నారు రాజానగరం మాజీ ఎమ్మెల్యే  జక్కంపూడి  రాజా. జగన్మోహన్ రెడ్డి ఓడినా .. గెలిచిన ఆయన రియల్ హీరో అని కొనియాడారు. ఆయన చుట్టూ ఉన్న పనికిమాలిన అధికారులు ఆయనను తప్పుదోవ పట్టించారన్నారు.
రాజకీయాల్లో ఎదురు దెబ్బలు తగిలినా మా నడవడిక మారదని వెల్లడించారు రాజానగరం మాజీ ఎమ్మెల్యే  జక్కంపూడి  రాజా. లక్షల రూపాయలు విలువ చేసే భూములను పేదలకు ఉచితంగా ఇచ్చాను అది నా తప్పా అంటూ ప్రశ్నించారు రాజానగరం మాజీ ఎమ్మెల్యే  జక్కంపూడి  రాజా. రాజకీయాల  కోసం నేను చేసిన అప్పులను నా ఆస్తులు మొత్తం అమ్మినా  సరిపోవు....నా ఆఖరి శ్వాస వరకు రాజశేఖర రెడ్డి కుటుంబంతోనే నడుస్తామన్నారు రాజానగరం మాజీ ఎమ్మెల్యే  జక్కంపూడి  రాజా.

మా ప్రభుత్వం ఎంతో ప్రజలకు చేయాలని ఉంది , కానీ ప్రజలు మా ఆలోచనలకు కళ్ళెం వేసారన్నారు. కొత్త ఏర్పడిన ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేయాలని కోరారు. వైసిపి కార్యకర్తలు మనో ధైర్యంతో ఉండాలని స్పష్టం చేశారు. వైసిపి పార్టీకి, నాతో పాటు కష్టపడిన నాయకులకు అందరకు ధన్యవాదాలు చెప్పారు. కూటమి ఇచ్చిన ఎన్నికల హమీలను తూచా తప్పక పాటించాలని కోరారు రాజానగరం మాజీ ఎమ్మెల్యే  జక్కంపూడి  రాజా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: