ఏపీ: ఐదేళ్లలో 30 ఏళ్ల డ్యామేజ్! గెలుపుకు కారణం చెప్పేసిన బాబు?

Purushottham Vinay
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఏ రేంజ్ లో జరిగాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా దేశంలో అన్ని రాష్ట్రాలలో ఎన్నికలు జరిగినా కూడా ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్ర ఎన్నికల ఫలితాలపై యావత్ భారత దేశం ఉత్కంఠంగా చూసింది. ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ లో అఖండ విజయంతో టీడీపీ కూటమి గెలుపొందింది. ఇక కూటమి విజయంతో సంబరాలు చేసుకుంటున్నారు టిడిపి, బిజెపి, జనసేన ఫ్యాన్స్. ఇకపోతే తాజాగా ఆంధ్రప్రదేశ్ ఫలితాలపై తాజా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడటం జరిగింది.ఇక నుంచి ఒక చంటి పాపని ఎంత జాగ్రత్తగా పెంచుతారో అలా ఆంధ్రప్రదేశ్ ని జాగ్రత్తగా పాలిస్తా అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు. ప్రస్తుతం ఆయనకి చాలా పెద్ద బాధ్యత ఉందని ఆ బాధ్యత ఎలా నెరవేరుస్తారో ఒక ప్రణాళిక రెడీ చేసుకుని పని చేస్తామని చంద్రబాబు అన్నారు. వైసీపీ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ ఐదు సంవత్సరాలలో జరిగిన నష్టం గురించి మాట్లాడారు. 30 సంవత్సరాలకు సరిపడా  డ్యామేజ్ అంతా ఈ 5 సంవత్సరాలలో వైసీపీ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిందని అన్నారు. 


అలాగే వ్యవస్థలు అన్ని కూడా సర్వ నాశనం అయ్యాయని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అలాగే వైసీపీ చేసిన అప్పుల గురించి కూడా చంద్రబాబు మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం వారు ఎన్ని అప్పులు చేశారో ఎంత చేశారో తెలియదు కానీ వారు ఆంధ్ర రాష్ట్రం అంతటా సహజ సంపదని విచ్చలవిడిగా దోపిడీ చేసుకున్నారని చంద్రబాబు అన్నారు. ఈ దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోయిందని అన్నారు. మేం ఏదైనా చేస్తాము మాకు ఎవరైనా అడ్డు వస్తే తొలగించుకునిపోతాము అని వైసీపీ వారు రౌడీల్లా ప్రవర్తించి అనడంతో వారికి ఎవరు కూడా ఎదురు చెప్పలేకపోయారు.భూగర్భ జలాలు ఇంకా అలాగే ఇసుక వైసీపీ నాయకుల దోపిడి వల్ల అడుగంటి పోయాయని అన్నారు. అయితే రైతులు వైసీపీ నాయకులకు ఎదురు చెప్పే సాహసం చేయలేకపోయారు. పాపం బెదిరించలేని నిస్సహాయ స్థితికి వచ్చేసారు. టిడిపి వాళ్ళు దీనిపై ప్రశ్నిస్తే హౌస్ అరెస్టులు చేసి అక్రమంగా నిర్బంధించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.తన గెలుపుకి అసలు కారణం ప్రజలే అని అన్నారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: