కృషి, ఓర్పు, నమ్మకం.. ఈ మూడే పవన్ గెలుపుకి ఆయుధాలు?

Purushottham Vinay
•అవమానాలని ఆయుధంగా మార్చుకున్న పవర్ స్టార్


•కష్టే ఫలి అన్నట్లుగా ముందుకు సాగి గెలిచిన పవన్


టాలీవుడ్ స్టార్ హీరో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్ పెద్ద స్టార్ హీరో మాత్రమే కాదు స్టార్ పొలిటిషియన్ గా కూడా తానేంటో నిరూపించాడు. చాలా సంవత్సరాలు ఎంతో కష్టపడ్డారు. తన సుఖాలని వదిలేసి జనాల్లోకి వచ్చి ఎంతో కష్టపడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయి మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి పోటీ చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఆయన కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించింది. పిఠాపురం ఓటర్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని నెత్తిన పెట్టుకొని ఆయనకి ఈ ఎన్నికల్లో బ్రహ్మరథం పట్టారు. పవన్ కళ్యాణ్ కి ఘన విజయాన్ని అందించారు. తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి అయిన వంగా గీతపై ఏకంగా 70 వేల ఓట్లకు పైగా భారీ మెజార్టీతో పవన్‌ కళ్యాణ్ భారీ విజయాన్ని అందుకున్నారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎంతో కష్టపడ్డ పవన్ కళ్యాణ్ కి విజయం దక్కడంతో ఆయన అభిమానులకి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.


టాలీవుడ్ స్టార్ హీరోగా ఎన్నో రికార్డులు క్రియేట్ చేసి అద్భుతమైన స్టార్ డం సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కూడా దూసుకుపోవాలని గోల్ పెట్టుకొని ఎంతో ఇష్టంగా జనాలకి సేవ చెయ్యడానికి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఎన్నో అవమానాలు పడ్డారు. ఆయన కుటుంబాన్ని ఎన్నెన్ని మాట్లాలన్నా సహనంతో ఓర్పుతో చాలా కష్టపడి జనాల్లోకి వెళ్లారు. ఆ కష్టానికి ప్రతిఫలంగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ గెలుపుతో పొలిటికల్ స్టార్ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కూడా రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు మేలు చేయాలనేది ఆయన బలమైన కోరిక. అందుకోసం ఎన్నో ఏళ్లుగా ఎన్నో అవమానాలని భరిస్తూ తన సుఖాలని వదిలిపెట్టి ఎండనక వాననక ఎంతగానో కష్టపడ్డారు. చివరికి ఎమ్మెల్యేగా గెలిచి చూపించాడు.తన అన్న మెగాస్టార్ ప్రజారాజ్యం పార్టీలో కీలక పాత్ర పోషించాడు.ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనం అయ్యాక గ్యాప్ తీసుకొని మళ్ళీ 2013 లో తన సొంతంగా జనసేన పార్టీని స్థాపించి అప్పటినుంచి ఎంతగానో కష్టపడ్డారు. చివరికి ఈ 2024 లో గెలిచి తన గోల్ ని నెరవేర్చుకున్నారు. ఇక పిఠాపురంని ఎలా అభివృద్ధి చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: