విశాఖపట్నం వెస్ట్: టీడీపీకి బంపర్ విక్టరీని అందించిన పీజీవిఆర్ నాయుడు!

Purushottham Vinay
విశాఖపట్నం వెస్ట్  అనేది ఆంధ్రప్రదేశ్‌లోని కీలకమైన అసెంబ్లీ  నియోజకవర్గాల్లో ఒకటి. ఈ నియోజకవర్గం  ఆంధ్ర ప్రదేశ్‌లోని కోస్తా ఆంధ్ర ప్రాంతంలో ఉంది. ఈ 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 13 మంది అభ్యర్థులు పోటీ చేశారు. 2019లో ఈ స్థానానికి పోటీ చేసిన వారి సంఖ్య 12 కాగా, 2014లో 12 మంది అభ్యర్థులు, 2009 ఎన్నికల్లో 14 మంది ఉన్నారు. 2024 లో విశాఖపట్నం పశ్చిమం వాల్తేర్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితాలో మొత్తం 2,07,408 మంది ఓటర్లు నమోదయ్యారు, వీరిలో 1,02,525 మంది థర్డ్ జెండర్ ఉన్నారు.పురుషులు, 1,04,873 మంది మహిళలు  ఇంకా 10 మంది ఉన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 2,36,625 మంది ఓటర్లు ఉండగా, వారిలో 1,02,525 మంది పురుషులు, 1,14,518 మంది మహిళలు ఇంకా 8 మంది థర్డ్ జెండర్ ఉన్నారు.


2014 ఎన్నికలలో, ఈ నియోజకవర్గంలో మొత్తం 2,26,938 మంది ఓటర్లు నమోదు చేయగా, వారిలో 1,20,120 మంది పురుషులు, 1,06,790 మంది మహిళలు ఇంకా 28 మంది థర్డ్ జెండర్ ఉన్నారు. 2009 ఎన్నికలలో, మొత్తం ఓటర్ల సంఖ్య 1,65,948, ఇందులో 86,115 మంది పురుషులు మరియు 79,833 మంది మహిళలు ఉన్నారు.ఆంధ్ర ప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల కార్పోరేషన్ ఛైర్మన్ అయిన ఆడారి ఆనంద్ కుమార్ ను విశాఖ పశ్చిమ నియోజకవర్గం పోటీలో నిలిపింది వైసిపి. ఆయన శ్రీ విజయ విశాఖ డెయిరీ ఛైర్మన్ గా కూడా వ్యవహరిస్తున్నాడు. టిడిపి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ గత రెండుసార్లుగా గెలుస్తూవస్తున్న పీజీవిఆర్ నాయుడు (పెతకంశెట్టి గణ వెంకట రెడ్డి నాయుడు) అలియాస్ గణబాబును మరోసారి బరిలో దింపింది. ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని టీడీపీ భావించింది.అనుకున్నట్లుగానే నాయుడు 90805 (+ 35184) ఓట్లతో గెలిచి టీడీపీకి హ్యాట్రిక్ విజయాన్ని అందించారు. ఆడారి ఆనంద్ కుమార్ 55621 ( -35184) ఓట్లతో ఓడిపోవడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: