విశాఖ - నర్సీపట్నం: టీడీపీని సునాయాసంగా గెలిపించిన అయ్యన్నపాత్రుడు!

Purushottham Vinay
విశాఖ నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగు దేశం పార్టీ అభ్యర్థి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఘన విజయం సాధించారు. రికార్డు స్థాయిలో ఒకే పార్టీ, ఒకే నియోజకవర్గం నుంచి పదో సారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు.ఏడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు మొత్తం 19 రౌండ్ లలో జరిగింది.రెండు రౌండ్లు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించారు. 17 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి టిడిపి అభ్యర్థి అయ్యన్నపాత్రుడు, తన సమీప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పై 21,597 ఓట్ల తో విజయకేతనo ఎగురవేశారు. 19 రౌండ్లకి గాను మొత్తం 97961 (+ 23860) ఓట్లు పోలయ్యాయి. ఇక ఈ నర్సీపట్నం నియోజకవర్గం విషయానికి వస్తే.. ఈ నియోజకవర్గంపై మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి మంచి పట్టు వుంది. మాజీ మంత్రి అయిన చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇక్కడి నుండి ఏకంగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు.మొదట 1983 వ సంవత్సరంలో నర్సీపట్నం బరిలో నిలిచి గెలిచిన అయ్యన్న ఆ తర్వాత 1985, 1994, 1999, 2004, 2014 సంవత్సరాల ఎన్నికల్లో తిరుగులేని విజేతగా గెలిచి స్ట్రాంగ్ గా నిలిచారు.


ఎన్టీఆర్ తో పాటు చంద్రబాబు నాయుడు కేబినెట్ లో కూడా మంత్రిగా పనిచేసిన సీనియర్ నేత ఈయన. ఇక వైసీపీ అభ్యర్థి పెట్ల ఉమా శంకర్ గణేష్ విషయానికి వస్తే గ్రామస్థాయి అంచెలంచెలుగా ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారు. ప్రముఖ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సొంత సోదరుడే ఈ ఉమా శంకర్. ఇద్దర సోదరులు సినిమా రంగంలో వున్నా ఉమాశంకర్ మాత్రం రాజకీయాల మీద ఆసక్తితో ఆ వైపు అడుగులేసారు. ఆయన 2014 ఎన్నికల్లో అయ్యన్న చేతిలో ఓడినా కానీ 2019 వ సంవత్సరంలో  మాత్రం విజయం సాధించారు. మళ్ళీ ఇప్పుడు ఆయన చేతిలో ఓడిపోవడం జరిగింది. పెట్ల ఉమా శంకర్ గణేష్ కి మొత్తం 74101 ( -23860) ఓట్లు పోలవ్వడం జరిగింది.నర్సీపట్నం నియోజకవర్గ పరిధిలో నాతవరం, గొలుగొండ, నర్సీపట్నం, మాకవరపాలెం మండలాలు ఉన్నాయి.నర్సీపట్నం అసెంబ్లీ ఓటర్ల విషయానికి వస్తే..ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య - 2,10,578 గా ఉంది. అందులో పురుషులు - 1,02,719 మంది ఉండగా

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: