విశాఖ: చోడవరంలో గెలుపు మోత మోగించిన టీడీపీ అభ్యర్థి సన్యాసి రాజు!

Purushottham Vinay
చోడవరం నియోజకవర్గంలో గత ఎన్నికలను పరిశీలిస్తే తెలుగుదేశం పార్టీ చాలా బలంగా వుందనే చెప్పాలి. ఇక్కడ తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం తర్వాత 1983 వ సంవత్సరంలో జరిగిన మొదటి ఎన్నికల్లోనే గూనూరు యెర్రునాయుడు గెలవడం జరిగింది.ఆ తర్వాత 1985 ఇంకా అలాగే 1994 సంవత్సరాలలో కూడా మళ్ళీ టిడిపిదే విజయం అయ్యింది. 2004 లో గంటా శ్రీనివాసరావు... 2009, 2014 సంవత్సరాలలో కలిదిండి సూర్యనాగ సన్యాసి రాజు టిడిపి నుండి పోటీచేసి విజయం సాధించడం జరిగింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసిపి హవా బాగా వీచింది... అప్పుడు చోడవరంలొ కూడా వైసీపీ పార్టీయే గెలిచింది. వరుసగా రెండు సార్లు టిడిపి చేతిలో ఓడిన కరణం ధర్మశ్రీ ఎట్టకేలకు చోడవరంలో గెలిచి విజయం సాధించడం జరిగింది.ఇక చోడవరం నియోజకవర్గ పరిధిలో చోడవరం, బుచ్చయ్యపేట,  రావికమతం, రోలుగుంట మండలాలు ఉన్నాయి.


చోడవరం అసెంబ్లీ ఓటర్ల విషయానికి వస్తే... నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య - 2,10,806 గా ఉంది. అందులో పురుషులు - 1,02,977 మంది ఉండగా మహిళలు - 1,07,816 మంది ఉన్నారు.చోడవరం అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థుల విషయానికి వస్తే.. వైసిపి అభ్యర్థిగా..అధికార వైఎస్సార్ కాంగ్రెస్ మరోసారి చోడవరం బరిలో కరణం ధర్మశ్రీని నిలిపింది. గత ఎన్నికల్లో గెలిచిన ఆయనయితే మళ్లీ టిడిపిని ఓడించగలడన్న నమ్మకంతో వైఎస్ జగన్ మళ్ళీ అతన్నే బరిలోకి దించారు. అందుకే చాలా నియోజకవర్గాల్లో సిట్టింగ్ లను మార్చినా కూడా చోడవరంలో మాత్రం జగన్ మోహన్ రెడ్డి అలాంటి ప్రయోగం చేయలేదు.ఇక టిడిపి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ కూడా మాజీ ఎమ్మెల్యే కలిదిండి సూర్యనాగ సన్యాసి రాజును చోడవరం పోటీలొ నిలిపింది. ఆయన 2009, 2014 ఎన్నికల్లో విజయం సాధించి 2019 లో మాత్రం ఓటమిపాలయ్యారు.కానీ ఈ 2024 ఎన్నికల్లో మాత్రం ఏకంగా 109651 (+ 42189) భారీ ఓట్లు దక్కించుకొని వైసీపీ పై ఘన విజయం సాధించారు. ఇక వైసీపీ అభ్యర్థి కరణం ధర్మశ్రీ 67462 ( -42189) ఓట్లతో పరాజయం పాలయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: