అసలైన సునామీ అంటే ఇదే.. పాణ్యంలో టీడీపీ అభ్యర్థి భారీ విజయం..??

Suma Kallamadi
నంద్యాల లోక్‌సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో పాణ్యం ఒకటి. పాణ్యం నియోజకవర్గంలో వైసీపీ నుంచి కాటసాని రామ్‌భూపాల్‌ రెడ్డి, టీడీపీ కూటమి నుంచి గౌరు చరితా రెడ్డి పోటీ పడ్డారు. ఓర్వకల్లు, కల్లూరు, గడివేముల, పాణ్యం మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య322,799. నేడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అయితే మొదటి నుంచి టీడీపీ అభ్యర్థి పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శించారు. మొత్తం 26 రౌండ్లు మూసేసరికి ఏయే పార్టీలు ఎన్ని ఓట్లు గెలుచుకున్నాయో, ఈసారి ఎవరు విజయం సాధించారో చూద్దాం.
* 2024 ఎన్నికల రిజల్ట్
వైసీపీ అభ్యర్థి కాటసాని రామ్‌భూపాల్‌ రెడ్డి - 1,00,681
టీడీపీ గౌరు చరితా రెడ్డి - 1,41,272
మొత్తం లెక్కింపు పూర్తయ్యాక టీడీపీ అభ్యర్థి గౌరు చరిత 40,591 భారీ మెజారిటీతో కాటసాని రామ్‌భూపాల్‌ రెడ్డిపై విజయ బావుటా ఎగరవేశారు. గౌరు చరితా రెడ్డికి ఇది చాలా పెద్ద విజయం అని చెప్పుకోవచ్చు.
గౌరు చరితారెడ్డి 2014లో పాణ్యం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. గతంలో, ఆమె 2004-2009 వరకు నందికొట్కూరుకు, 2014-2019 వరకు పాణ్యంకు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఏపీలో మహిళా, శిశు సంక్షేమ కమిటీ సభ్యురాలిగా కూడా ఉన్నారు. ఆమె భర్త గౌరు వెంకట రెడ్డి కూడా రాజకీయ నాయకుడు.
కాటసాని రాంభూపాల్ రెడ్డి 2019 ఎన్నికల్లో పాణ్యం నుంచి విజయం సాధించారు. గతంలో 1985, 1989, 1994, 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి పాణ్యం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పాణ్యం నుంచి పోటీ చేశారు. ఈసారి ఆయన ఘోర పరాజయం పాలయ్యారు. అన్ని రౌండ్లలో వెనుకంజలో ఉంటూ వచ్చారు. చివరికి భారీ ఓట్ల తేడాతో ఓటమిని చవిచూశారు. ఐదు ఆరు రౌండ్ల తర్వాతి రౌండ్లలో కాటసాని ఏమైనా పుంజుకునే అవకాశం ఉంటుందో అని వైసీపీ నాయకులు ఎంతో ఆశించారు కానీ మొండిచేయ్యే ఎదురయింది. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చడమే ఓడిపోవడానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ఎన్ని సంక్షేమ పథకాలను అందించిన ప్రజలు మాత్రం వైసీపీ కి ఓటు వేయకపోవడం నిజంగా విస్మయకరం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: