అప్పుడు తొలిప్రేమ ఇప్పుడు 21 సీట్లు.. పవన్ కెరీర్ లో ఈ రెండూ ఎంతో స్పెషల్!

Purushottham Vinay
ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్ చాలా సంవత్సరాలుగా తన సుఖాలని వదిలేసి జనాల్లోకి వచ్చి ఎంతో కష్టపడి ఈ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయి మెజారిటీతో ఊహించిన విధంగా ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ కి ఆయన కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించింది. పిఠాపురం ఓటర్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని నెత్తిన పెట్టుకొని ఆయనకి ఈ ఎన్నికల్లో బ్రహ్మరథం పట్టారు. పవన్ కళ్యాణ్ కి ఊహించిన విధంగానే ఘన విజయాన్ని అందించారు. తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి వంగా గీతపై ఏకంగా 70 వేల ఓట్లకు పైగా భారీ మెజార్టీతో పవన్‌ కళ్యాణ్ భారీ విజయాన్ని అందుకున్నారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈరోజు ఎంతో కష్టపడ్డ పవన్ కళ్యాణ్ కి విజయం దక్కడంతో ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.


ఈ నేపథ్యంలో కొద్ది సేపటి క్రితం ఆయన ఇచ్చిన స్పీచ్ హైలెట్ అయ్యింది.ఆ స్పీచ్ లో పవన్ కళ్యాణ్ తొలిప్రేమ సినిమా రోజులని గుర్తు తెచ్చుకున్నారు. తన తొలిప్రేమ సినిమా సూపర్ డూపర్ హిట్ అయినప్పుడు తాను తొలి విజయం రుచి చూశానని ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ అలాంటి మంచి విజయం రుచి చూశానని చెప్పారు. ఆయన పార్టీ పోటీ చేసిన 21 సీట్లలో కూడా ఘన విజయం సాధించింది. అప్పుడు తొలిప్రేమతో సినిమా స్టార్ గా మారిన పవన్ ఇప్పుడు ఈ గెలుపుతో పొలిటికల్ స్టార్ అయ్యారు.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్ స్ నెట్టింటా తెగ వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కూడా రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు మేలు చేయాలనేది తన కోరిక. అందుకోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడ్డారు.తన అన్న మెగాస్టార్ ప్రజారాజ్యం పార్టీలో కీలక పాత్ర పోషించాడు.ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనం అయ్యాక గ్యాప్ తీసుకొని మళ్ళీ 2013 లో తన సొంతంగా జనసేన పార్టీని స్థాపించి అప్పటినుంచి ఎంతగానో కష్టపడ్డారు. చివరికి ఈ 2024 లో గెలిచి తన గోల్ ని నెరవేర్చుకున్నారు. ఇక పిఠాపురంని ఎలా అభివృద్ధి చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: