ప్రభుత్వ ఉద్యోగులు, నిరుద్యోగులకు పవన్ శుభవార్తలు.. రియల్ హీరో అయ్యారుగా!

Suma Kallamadi
పోటీ చేసిన ప్రతి చోటల్లా గెలిచి జనసేన పార్టీ భారతదేశ ఎన్నికల ఒక చరిత్ర సృష్టించింది. ఆయన పొత్తు కుదుర్చుకున్న కూటమి ఏపీలో ఘన విజయం సాధించింది. ఎన్నికల లెక్కింపు పూర్తి అయిన తర్వాత తాజాగా పవన్ కళ్యాణ్ ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ఈ కొత్త పిఠాపురం ఎమ్మెల్యే చాలా హుందాగా బాధ్యతాయుతంగా మాట్లాడారు అంతేకాదు ప్రభుత్వ ఉద్యోగులకు, నిరుద్యోగులకు శుభవార్తలు చెప్పారు. మెగా డీఎస్సీ విడుదల చేసే బాధ్యత నాది అని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించారు పవన్. అలాగే సీపీఎస్ విషయంలో న్యాయం చేస్తానని ఆయన ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందించారు.
"మీరు నాపై చాలా పెద్ద బాధ్యత పెట్టారు. ఉద్యోగులకు సీపీఎస్ విషయంలో న్యాయం చేస్తాం. ఆడబిడ్డలు గత ఐదేళ్లలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. సగటు మధ్యతరగతి మనుషులు నలిగిపోయారు. శాంతిభద్రతలు చాలా వైఫల్యం జరిగింది అవన్నీ గాడిలో పెట్టేలా బాధ్యత తీసుకుంటాం. రాజకీయ ప్రమయం చాలా తక్కువ ఉండేలా అధికారులు తమ పని తాము చేసుకునేలాగా వ్యవస్థలను గాడిలో పెడతాము. ఆంధ్రాలో ప్రతి ఊర్లో ఉండే మనిషి కష్టాన్ని నేను స్వయంగా చూశాను. 2019లో ఓడిపోతే నా మానసిక స్థితి ఎలా ఉందో ఇప్పుడు గెలిచాక కూడా నా మానసిక స్థితి అలాగే ఉంది...."

"ఈ రోజున నా ముందు ఇంతమంది ఉన్నారు. కానీ భీమవరం, గాజువాక రెండు చోట్లా ఓడిపోయినప్పుడు నా పక్కన నేను నమ్ముకున్న పదిమంది తప్ప ఎవరూ లేరు. నేను ఓటమి చూసి భయపడను ఓటమి నాకు బలాన్నిస్తుంది, ఉత్సాహం ఇస్తుంది. నేను ఒకటే నమ్మాను చిన్నప్పుడు తిరుపతిలో ఉన్నప్పుడు ధర్మో రక్షతి రక్షితః అనేది చదివా. నువ్వు ధర్మాన్ని రక్షిస్తే నిన్ను ధర్మాన్ని రక్షిస్తుంది. ఇప్పుడు 30 ఏళ్ల క్రితం నేను ఇది చదువుకున్నా, ఈరోజు ధర్మం కోసం నిలబడ్డా. అందుకే మనస్ఫూర్తిగా కనిపించని, దేవుళ్లందరికీ కూడా ఈరోజు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా." అని పవన్ చెప్పుకొచ్చారు.
"నాకు పరువు ఇచ్చారు. గుండెల్లో పెట్టుకున్నారు. గొప్ప గెలుపు ఇచ్చి ఆకాశమంత ఉత్సాహం ఇచ్చారు, ఇప్పుడు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటా, నిర్మాణాత్మకంగా పనిచేస్తా, మీ కష్టాలలో మీ కన్నీటిలో ఒకటిలా నేను ఉంటానని మాట ఇస్తున్నాను" అని పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: