తెలంగాణలో విజయం సాధించిన.. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు వీరే?

praveen
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ఉత్కంఠకు తెరపడింది. ఏ పార్టీకి మెజారిటీ వస్తుంది అనే విషయంపై ఒక క్లారిటీ వచ్చేసింది. ఎగ్జిట్ పోల్స్ లో చెప్పిన అంచనా ఎగ్జాక్ట్ గా నిజమైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలలో విజయం సాధించలేక.. ప్రతిపక్ష హోదాకి మాత్రమే పరిమితమైన బిఆర్ఎస్ పార్టీ కనీసం ఒక్కటంటే ఒక్క సీట్లో కూడా విజయం సాధించలేకపోయింది. అయితే ఎన్నో ఏళ్ల నుంచి తెలంగాణ రాజకీయాల్లో పట్టు సాధించాలని చూస్తున్న బిజెపి మాత్రం అధికార కాంగ్రెస్కు పోటీ ఇస్తూ మెజారిటీ స్థానాలలో విజయం అందుకుంది.

 ఈ క్రమంలోనే ఒకవైపు కాంగ్రెస్ ఎనిమిది స్థానాలలో విజయం సాధిస్తే ఇంకోవైపు బిజెపి పార్టీ కూడా ఎనిమిది పార్లమెంట్ సెగ్మెంట్లలో ఘన విజయాన్ని అందుకుంది అని చెప్పాలి. ఇంకోవైపు హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో ఎప్పటిలాగానే ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ విజయ డంకా మోగించారు. ఇక బిజెపి తరఫున పోటీ చేసి విజయం సాధించిన అభ్యర్థుల వివరాలు చూస్కుంటే..
1. అదిలాబాద్ - జి.నగేష్
2. మల్కాజ్గిరి - ఈటల రాజేందర్
3. సికింద్రాబాద్ - కిషన్ రెడ్డి
4. మెదక్ -  రఘునందన్ రావు
5. మహబూబ్నగర్ - డీకే అరుణ
6. కరీంనగర్ - బండి  సంజయ్
7. నిజాంబాద్ - ధర్మపురి అరవింద్
8. చేవెళ్ల - కొండా విశ్వేశ్వర్ రెడ్డి బిజెపి తరఫున పోటీ చేసి విజయం సాధించారు.
 కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచిన అభ్యర్థుల లిస్టు చూసుకుంటే..
1. నల్గొండ - రఘువీర్ రెడ్డి
2. వరంగల్ - కడియం కావ్య
3. ఖమ్మం - రఘురామిరెడ్డి
4. మహబూబాబాద్ - బలరాం నాయక్
5. నాగర్ కర్నూల్ - మల్లు రవి
6. భువనగిరి - కిరణ్ కుమార్
7. జహీరాబాద్ - సురేష్ షట్కర్
8. పెద్దపల్లి - వంశీకృష్ణ.. కాంగ్రెస్ తరపున విజయం సాధించగా హైదరాబాద్ స్థానంలో ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ విజయ డంకా మోగించారు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: