విశాఖ సౌత్: గాజు గ్లాస్ పవర్ చూపించిన వంశీ కృష్ణ శ్రీనివాస్!

Purushottham Vinay
విశాఖలోని అన్ని నియోజకవర్గాల్లో మాదిరిగానే దక్షిణంలో కూడా టిడిపి చాలా స్ట్రాంగ్ గా వుంది. ప్రత్యేక ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు తర్వాత జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ నియోజకవర్గంలో తెలుగు దేశం పార్టీ గెలిచింది.వాసుపల్లి గణేష్ కుమార్ వరుసగా విజయం సాధిస్తూ వస్తున్నారు. అయితే రాజకీయ పరిణామాల నేపథ్యంలో విశాఖ సౌత్ ఎమ్మెల్యే కాస్త వైసిపిలో చేరిపోవడం జరిగింది.తెలుగుదేశం పార్టీ నుండి చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లికే వైసిపి టికెట్ కేటాయిచేయడం జరిగింది. ఇక పొత్తులో భాగంగా ఈసారి తెలుగుదేశం పార్టీ కాకుండా జనసేన విశాఖ దక్షిణ నియోజకవర్గంలో పోటీ చేస్తోంది. విశాఖపట్నంలోని 12 నుండి 34 వరకు, 42, 43 మరియు 46 నుండి 48 వరకు గల వార్డులు ఈ విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. 


విశాఖ దక్షిణ అసెంబ్లీ ఓటర్ల విషయానికి వస్తే.. ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య - 2,09,356 గా ఉంది. అందులో పురుషులు - 1,04,826 మంది ఇంకా మహిళలు - 1,04,501 మంది ఉన్నారు.ఈసారి వైసిపి అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఈసారి వైసిపి తరపున పోటీ చేయడం జరిగింది. ఆయన 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ నుండి పోటీ చేసి విజయం సాధించారు. టిడిపి, జనసేన, బిజెపి కూటమి నుంచి జనసేన అభ్యర్థిగా విశాఖ సౌత్ లో వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఈ ఎన్నికలలో పోటీ చేయడం జరిగింది. పొత్తులో భాగంగా ఈ సీటును జనసేన పార్టీకి కేటాయించడంతో ఈయన్ని ఎంపిక చేసారు. జనసేన అధికారికంగా ప్రకటించి వంశీకృష్ణ యాదవ్ కుజనసేన అధినేత పవన్ నుండి తగిన సహాయ సహకారాలు అందించడం జరిగింది. ఈ ఎన్నికల్లో వంశీ కృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఏకంగా 97868 (+ 64594) భారీ మెజారిటీతో ముందంజలో దూసుకుపోతున్నాడు. వాసుపల్లి గణేష్ కుమార్ 33274 ( -64594) ఓట్లతో వెనుకంజలో ఉన్నారు.సో ఈ నియోజకవర్గంలో జనసేన వైసీపీ పై ఆదిక్యంలో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: