విశాఖ - నార్త్: వైసీపీ రాజుని నేలమట్టం చేసిన బీజేపీ రాజు?

Purushottham Vinay
విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో తెలుగు దేశంతో పాటు బిజెపి కూడా చాలా బలంగానే వుంది. ప్రత్యేక ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 2014 వ సంవత్సరంలో మొదటి ఎన్నికలు జరగ్గా బిజెపి గెలిచి విజయం సాధించింది.ఇప్పటి లాగే ఆ ఎన్నికల్లో కూడా టిడిపి ఇంకా బిజెపిల మధ్య పొత్తు వుంది... దీంతో బిజెపి సీనియర్ నాయకులు పెన్మెత్స విష్ణుకుమార్ రాజు పోటీచేసి గెలవడం జరిగింది. ఇక 2019 అసెంబ్లీ ఎన్నికల్లో అయితే తెలుగుదేశం ఒంటరిగా పోటీచేసింది. అప్పుడు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పోటీచేసి విజయం సాధించారు. బిజెపి నుండి పోటీచేసిన విష్ణుకుమార్ రాజు కేవలం నాలుగో స్థానానికి పరిమితం అయ్యారు. అయితే ఇదిలా వుంటే ఈ విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైసిపి ఇప్పటి దాకా గెలిచింది లేదు. అందుకే ఈసారి ఎలాగైనా గెలిచి విశాఖలో సత్తా చాటాలని చూస్తోంది. అందుకోసమే మరోసారి కమ్ముల కన్నపరాజును వైసిసి అదిష్టానం బరిలోకి దింపింది.


 విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిధిలో విశాఖపట్నంలోని 36 నుండి 41 వరకు, 41,44, 45 ఇంకా 49 నుండి 52 వరకు గల వార్డులు ఈ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. విశాఖ ఉత్తర అసెంబ్లీ ఓటర్లు విషయానికి వస్తే ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య - 2,80,328 కాగా అందులో పురుషులు - 1,39,952 ఇంకా మహిళలు - 1,40,359 మంది ఉన్నారు. ఈ 2024 ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి విషయానికి వస్తే.. ఇప్పటి దాకా విశాఖ నార్త్ నియోజకవర్గంలో వైసిపి గెలిచింది లేదు... కానీ 2019 ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థినే వైసిపి రిపీట్ చేసింది. మరోసారి కమ్ముల కన్నపరాజు విశాఖ నార్త్ లో పోటీ చేయించింది. ఇక బిజెపి అభ్యర్థిగా టిడిపి, జనసేన, బిజెపి కూటమి నుంచి విశాఖ నార్త్ లో మాజీ ఎమ్మెల్యే పెన్మెత్స విష్ణుకుమార్ రాజు పోటీ చేశారు. పొత్తులో భాగంగా ఈ సీటును బిజెపికి కేటాయించడంతో విష్ణుకుమార్ రాజు పోటీ చేశారు. ఆయన ప్రస్తుతం 102367 (+ 44975) మెజారిటీతో ఉండి వైసీపీని నేల మట్టం చేశాడు. 57392 ( -44975) ఓట్లతో కమ్ముల కన్నప రాజు వెనుకంజలో ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: