విశాఖ - ఈస్ట్: భారీ మెజారిటీతో వైసీపీని చిత్తు చేసిన టీడీపీ?

Purushottham Vinay
విశాఖ తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ చాలా బలంగా వుంది. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకణలో భాగంగా 2008 వ సంవత్సరంలో ఈ అసెంబ్లీ ఏర్పడింది. అప్పటి నుండి ఇప్పటి దాకా కూడా మొత్తం మూడు సార్లు (2009, 2014, 2019) అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా అన్నిసార్లు టిడిపిదే విజయం అయ్యింది. వరుసగా విజయాలు సాధిస్తూ వెలగపూడి రామకృష్ణబాబు హ్యాట్రిక్ కొట్టేసాడు. ఇక ఈసారి ఈ 2024 అసెంబ్లీ ఎన్నికలలో కూడా భారీ విజయం నమోదు చేసేందుకు గాను టిడిపి మళ్లీ రామకృష్ణబాబునే బరిలోకి దింపింది. విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఇప్పటి దాకా వైసిపికి విజయమే లేదు.అందువల్ల ఈసారి ఎలాగైనా ఈ నియోజకవర్గాన్ని కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో వున్న వైసిపి బలమైన అభ్యర్థిని బరిలోకి దింపింది. విశాఖ ఎంపి ఎంవివి సత్యనారాయణను తూర్పు నియోజకవర్గంలో బరిలోకి దింపడం జరిగింది.విశాఖ తూర్పు నియోజకవర్గ పరిధిలో విశాఖపట్నం మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని 1 నుండి 11 వరకు, 53 నుండి 55 వరకు గల వార్డులు ఉన్నాయి.


విశాఖ తూర్పు అసెంబ్లీ ఓటర్ల విషయానికి వస్తే..ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య - 2,72,448 మంది ఉన్నారు. అందులో పురుషులు - 1,34,882 ఉండగా మహిళలు - 1,37,544 మంది ఉన్నారు.విశాఖపట్నం తూర్పు అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థుల విషయానికి వస్తే...వైసిపి అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఉన్నారు.ఎలాగైనా రాష్ట్ర రాజధానిగా ప్రకటించిన విశాఖలో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలన్న పట్టుదలతో వైసిపి వుంది. అందువల్లే ఇప్పటి దాకా గెలుపన్నదే ఎరుగని విశాఖ తూర్పు నియోజకవర్గంలో బలమైన అభ్యర్థిని బరిలోకి దింపింది. సిట్టింగ్ ఎంపీ ఎంవివి సత్యనారాయణ విశాఖ తూర్పు అసెంబ్లీలో పోటీ చేశాడు.టిడిపి అభ్యర్థిగా.. తెలుగుదేశం పార్టీ గత మూడు సార్లుగా విశాఖ తూర్పులో ఓటమన్నదే ఎరగని వెలగపూడి రామకృష్ణబాబునే మరోసారి బరిలోకి దింపడం జరిగింది. అయన ఇప్పుడు ఈ ఎన్నికల కౌంటింగ్ లో ఏకంగా 116585 (+ 62711)  భారీ మెజారిటీతో ముందంజలో ఉండగా 53874 ( -62711) ఓట్లతో వైసీపీ అభ్యర్థి ఎంవివి సత్యనారాయణ వెనుకంజలో ఉన్నారు. దీంతో వైసీపీ విశాఖ తూర్పులో టీడీపీ చేతిలో చిత్తుగా ఓడిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: