విశాఖ - గాజువాక: పల్లాకి(టీడీపీ) సాటిలేదు.. గుడివాడ(వైసీపీ) గుడ్డు పొదగట్లేదు?

Purushottham Vinay
గత మూడు అసెంబ్లీ ఎన్నికలను కనుక ఒకసారి పరిశీలిస్తే గాజువాక జనాలు వినూత్న తీర్పుని ఇస్తూ వస్తున్నారు. 2009 లో ప్రజారాజ్యం, 2014లో తెలుగుదేశం పార్టీ ఇంకా అలాగే 2019 లో వైసిపిని గెలిపించారు గాజువాక ఓటర్లు. ఇలా మూడుసార్లు మూడు వేరువేరు పార్టీలు గాజువాకలో గెలవడం జరిగింది. మరి ఈసారి గెలుపు ఎవరిదన్నది మాత్రం చాలా అంటే చాలా ఆసక్తికరంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గాజువాక నుండి పోటీ చేసారు. దీంతో ఈ నియోజకవర్గం పేరు రాష్ట్రవ్యాప్తంగా ఎంతగానో మారుమోగింది. కానీ గాజువాక ప్రజలు మాత్రం పవన్ కళ్యాణ్ ను చిత్తుగా ఓడించారు.అయితే పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోను, ఓ పార్టీ అధినేతను ఓడించిన నాగిరెడ్డిని ఈసారి వైసిపి పక్కనబెట్టి ఆయన స్దానంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డిని పోటీచేయించింది వైసిపి. దీంతో గాజువాక అసెంబ్లీ ఫలితంపై తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.


గాజువాక నియోజకవర్గ పరిధిలో గాజువాక, పెదగంట్వాడ మండలాలు ఉన్నాయి. గాజువాక అసెంబ్లీ ఓటర్ల విషయానికి వస్తే..ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య - 3.12 లక్షలు ఉండగా అందులో  పురుషులు - 1,57,787, మహిళలు - 1,55,009 ఉన్నారు.గాజువాక అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు విషయానికి వస్తే..వైసిపి అభ్యర్థిగా గాజువాకలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి అయిన గుడివాడ అమర్నాథ్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అనకాపల్లి నుండి అతన్ని గాజువాకకు షిప్ట్ చేసారు. అయితే ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే నాగిరెడ్డికి ఈసారి అవకాశం దక్కలేదు. ఇక టిడిపి అభ్యర్థిగా.. తెలుగుదేశం పార్టీ గాజువాకలో పల్లా శ్రీనివాసరావును మరోసారి పోటీ చేయించడం జరిగింది. 2014 లో ఇదే గాజువాక నుండి గెలిచిన పల్లా 2019 లో మాత్రం మూడో స్థానానికి మాత్రమే పరిమితం అయ్యారు. ఈ 2024 ఎన్నికలలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల కౌంటింగ్ లో పల్లా శ్రీనివాసరావు ఏకంగా 71370 (+ 44667)ఓట్లతో లీడింగ్ లో ఉండగా.. అమర్నాథ్ కేవలం 30231 ( -46924)ఓట్లతో వెనకంజలో ఉన్నాడు.గుడ్డు పొదగక చాలా తంటాలు పడుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: