బాబుకు బంపర్ ఆఫర్ ఇచ్చిన మోదీ..?

Pulgam Srinivas
భారతీయ జనతా పార్టీ 2014 వ సంవత్సరం జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో భారీ మొత్తంలో పార్లమెంటు స్థానాలను దక్కించుకొని దేశంలో అధికారం లోకి వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే . ఇక ఆ తర్వాత 2019 వ సంవత్సరంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో బిజెపి 2014 కంటే ఎక్కువ పార్లమెంట్ స్థానాలను సంపాదించుకొని మరో సారి దేశంలో ప్రభుత్వాన్ని నెలకొల్పింది . ఇకపోతే 2024 వ సంవత్సరరానికి గాను గత కొన్ని విడతలుగా దేశమంతటా పార్లమెంట్ ఎన్నికలు జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే.

ఆ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు ఈ రోజు విడుదల అవుతున్నాయి. ఈ ఫలితాలు విడుదల కాకముందు అనేక సర్వే సంస్థలు , ఎగ్జిట్ పోల్స్ సంస్థలు ఈ సారి nda కూటమికి దాదాపు 380 సీట్లు ఈజీగా వస్తాయి. 400 పైకి సీట్లు వచ్చిన పెద్దగా ఆశ్చర్యం లేదు అని అంచనాలు కట్టాయి. దానితో జనాలు అంతా బీ జే పీ చాలా ఈజీగా ప్రభుత్వాన్ని నెలకొల్పుతుంది అని భావించారు. కానీ రిజల్ట్ డే రోజు సేన్ రివర్స్ అయ్యింది.

NDA కూటమికి 290 పార్లమెంట్ స్థానాల కంటే ఎక్కువ అవకాశం కనిపించడం లేదు. దానితో మోడీకి ప్రతి చాలా పార్టీల ఎంపీ సీట్లు ప్రధానంగా మారాయి. ఇకపోతే ఈ రోజు వచ్చిన ఫలితాలలో టిడిపి పార్టీకి భారీ మొత్తంలో ఎంపీ స్థానాలు రాబోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానితో మోడీ , చంద్రబాబు కు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది. nda కూటమికి బాబు మద్దతు కచ్చితంగా అవసరం ఉండడంతో ఆయనను ఎన్డీఏ కన్వీనర్ గా నియమించబోతున్నట్లు , ఈ విషయాన్ని ప్రధాని , మోదీ అమీత్ షా , చంద్రబాబు కు ఫోన్ చేసి చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: