బాబ్ ఈజ్ బ్యాక్: బాబు శపధం చేస్తే రిజల్ట్ అట్లుంటది మరి!

Purushottham Vinay
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో దాదాపుగా రెండున్నర సంవత్సరాల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక శపధం చేశారు. 2021లో జరిగిన శాసనసభ సమావేశంలో బాబు గట్టి శపధం చేశారు.తనను ఘోరంగా అవమానించిన సభను కౌరవ సభగా అభివర్ణించి మళ్లీ తాను ముఖ్యమంత్రిగానే సభలోకి ప్రవేశిస్తాను అని బాబు గట్టిగా శపధం చేశారు.ఆ తరువాత బాబు రెండున్నర సంవత్సరాల పాటు అసెంబ్లీ ముఖం చూడలేదు. బాబు సీఎం గానే సభలోకి రాబోతున్నారు అన్నది కౌంటింగ్ తరువాత చూస్తే తెలుస్తుంది. అది కూడా చంద్రబాబు కూడా ఊహించని విధంగా కనీ వినీ ఎరుగని తీరులో ఏపీలో అధ్బుతమైన విజయాన్ని టీడీపీకి ప్రజలు ఇస్తున్నారు. మొత్తం 144 అసెంబ్లీ సీట్లలో పోటీ చేసిన టీడీపీకి వందకు పైగా సీట్ల నుంచి ఇంకా ఎక్కువగానే సీట్లు అందించే విధంగానే రిజల్ట్స్ ఉండబోతున్నాయని తెలుస్తుంది.శపధం చేసి అసెంబ్లీలో తిరిగి అడుగు పెట్టిన వారిలో మొదట అన్నగారు కీర్తి శేషులు ఎన్టీఆర్ ఉంటే ఆ తరువాత రాజన్న తనయుడు జగన్ మోహన్ రెడ్డి నిలిచారు.


ఇపుడు ఆ శపధం నెరవేర్చుకుని చంద్రబాబు నాయుడు ఆ లిస్ట్ లోకి చేరబోతున్నారు. ఇంకా అంతే కాదు ఆయన ఏకంగా ఏడున్నర పదుల వయసులో ఏపీకి నాలుగవ సారి ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఈ రికార్డు కూడా బహుశా ఎవరికీ ఉండకపోవచ్చు అని తెలుస్తుంది.చంద్రబాబు గత అయిదేళ్ళుగా ఎంతో కష్టపడ్డారు. 70 ఏళ్ల పై వయసులో కూడా అవిశ్రాంతంగా పోరాటం చేశారు అని చెప్పాలి. ఆయన ఘోర ఓటమి నుంచి వెంటనే తేరుకుని జనంలోకి వెళ్ళాడు. ఇంకా అంతే కాదు ఎవరూ తిరగనన్ని సార్లు ఆయన ఏపీలో సుడిగాలి పర్యటనలు కూడా చేశారు. లేటు వయసులో బాబు జనంలో తిరగడం కష్టపడడం వంటి వాటికి సరైన ఫలితం వచ్చిందనే టీడీపీ తమ్ముళ్లు అంటున్నారు.ఈసారి జనాలు కూడా బాబుని గట్టిగా విశ్వసించారు. ఏపీలో అభివృద్ధి లేదని అలాగే ఏపీలో శాంతిభద్రతలు లేవని ఏపీలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవని చంద్రబాబు నాయుడు చేసిన ప్రచారానికి జనాల నుంచి అంతే స్థాయిలో ప్రతిస్పందన లభించింది అని తెలుస్తుంది. మొత్తానికి బాబు కష్టాన్ని నమ్ముకొని తన శపధాన్ని నేరవేర్చుకొని బాబ్ ఈజ్ బ్యాక్ అనిపించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: