ఏపీలో ట్రెండ్స్ సర్వే.. అసలు రిజల్ట్ అప్పుడే..!

lakhmi saranya
అందరూ ఎంతో ఉత్సాహంగా.. ఉత్కంఠ గా ఎదురు చూస్తున్న అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల ఓట్లు లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అయింది. అయితే అనుకున్నంత ఈజీగా అయితే ఫలితం వచ్చేయదు. ఎందుకంటే భారీగా పెరిగిన ఓటర్ల కారణంగా ట్రెండ్స్ రావడానే రెండు గంటల నుంచి మూడు గంటల సమయం పట్టదు. ఇక ఫలితాలు వెల్లుడి కావడానికి ఐదు గంటల నుంచి 6 గంటల సమయంలో తక్కువలో తక్కువ పట్టనుంది. అంటే ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమయ్యే కౌంటింగ్ లో తొలి ఫలితం.. అంటే విజేత ఎవరు అనేది ప్రకటించడానికి మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట వరకు సమయం పడుతుంది.
ఇక అప్పటి నుంచి వరుసగా ప్రకటించిన.. అరకు, అమలాపురం వంటి పెద్ద నియోజకవర్గం పరిస్థితి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగునుంది. ఇక వీటిలోనూ మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించారు. అది పూర్తయ్యలోపే రెగ్యులర్ ఓట్లు లెక్కింపు చేపడతారు. మొత్తం 3.33 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోగా.. 4,61 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేశారు. పార్లమెంట్ స్థానాలకి 2,443 ఈవీఎం టేబుళ్లు, 443 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లు , 557 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లు సిద్ధం చేశారు. ఓవరాల్ గా కౌంటింగ్ కోసం 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేయడం జరిగింది. పార్లమెంట్ స్థానాల్లో అమలాపురం ఫలితాలు రావడానికి చాలా టైం పట్టనుంది. తొలి ఫలితం మాత్రం రాజమండ్రి మరియు నరసాపురంలలో  వస్తుంది.
పార్లమెంట్ విషయానికి వస్తే అమలాపురంలో అత్యధికంగా 27 రౌండ్స్ కౌంటింగ్ జరగనున్నందున అక్కడ దాదాపు 9 నుంచి 10 గంటల పాటు ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇక నరసాపురం మరియు రాజమండ్రిలో కేవలం 13 రౌండ్లలో దాదాపు 5 నుంచి 6 గంటల్లో ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది. భీమిలి, పాణ్యంలలో అత్యధిక రౌండ్లు అసెంబ్లీ స్థానాల విషయాని కొస్తే భీమిలి, పాణ్యంలలో  ఫలితాలు ఆలస్యం కానున్నాయి. కొవ్వూరు మరియు నరసాపురంలో త్వరగా తొలి ఫలితం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. పాణ్యం, భీమిలి లలో అత్యధికంగా 26 రౌండ్లలో కౌంటింగ్ జరగనుండగా.. దాదాపు 9 నుంచి 10 గంటలలో లెక్కింపు పూర్తవుతుంది. అత్యల్పంగా నరసాపురం మరియు కొవ్వూరులో అత్యల్పంగా 13 రౌండ్స్ ఉండగా.. దాదాపు 5 గంటల్లోనే తొలి ఫలితం రానుంది. అంటే ఎలా చూసుకున్నా మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రెండ్స్ మాత్రమే రానున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: