రాయలసీమ: కంచుకోటలోనే కుప్పకూలిపోయిన వైసీపీ?

Purushottham Vinay
జగన్ సీఎం కావాలని గత రెండు ఎన్నికల్లో కూడా ఆయనకు అండగా నిలిచి వైసీపీకి కంచు కోటలా మారిన రాయలసీమ 2024 నాటికి మాత్రం వైసీపీకి భారీ షాక్ ఇచ్చేసి కుప్పకూలిపోయేలా చేసింది. ఎక్కడైతే అద్భుతమైన విజయాలను వైసీపీ మూటకట్టుకుందో ఆ రాయలసీమ నేల మీదనే ఇపుడు వైసీపీ చతికిలపడే పరిస్థితి వచ్చింది.రాయలసీమలో 2019 ఎన్నికల్లో వైసీపీ మొత్తం నాలుగు జిల్లాలలో ఉన్న 52 సీట్లకు గానూ కేవలం 3 సీట్లు తప్ప అన్నింటినీ కూడా గెలుచుకుంది. కానీ ఈసారి బొమ్మ తిరగబడుతోంది అని పూర్తిగా అర్ధం అవుతోంది. రాయలసీమలో ఎప్పుడూ లేని విధంగా ఇంకా చెప్పాలంటే గత పాతికేళ్లలో ఎన్నడూ చూడని విధంగా టీడీపీ కూటమి ఏకంగా నలభై సీట్లకు పై దాటి గెలుచుకునే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపించబోతున్నాయి.అదే సమయంలో జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో అయితే పదికి పది సీట్లు 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుచుకుంది. కర్నూల్ లో ఒకనాడు క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ ఇపుడు ఎన్నో ఇబ్బందులు పడుతూ కోలుకోలేని కష్టాలను ఎదుర్కొంటోంది. ఇంకా అలాగే చిత్తూరు జిల్లాలో కూడా వైసీపీ కంచుకోటలు దారుణంగా కూలిపోతున్నాయి.


ఇక అనంతపురం జిల్లాలో అయితే పరిస్థితి పూర్తిగా మారిపోయి వైసీపీకి వ్యతిరేకంగా ఇంకా టీడీపీకి అనుకూలంగా కనిపిస్తోంది.వైసీపీకి రాయలసీమలో ఇంతటి దయనీయ పరిస్థితి వచ్చింది. వైసీపీని స్థాపించాక జగన్ మోహన్ రెడ్డికి కడప లోక్ సభలో అయిదున్నర లక్షల ఓట్ల భారీ మెజారిటీ కట్టబెట్టిన సీమ జిల్లాలు ఆయనకు 2014లో కూడా అండగా నిలిచిన ప్రాంతాలు అప్పట్లో 67 ఎమ్మెల్యే సీట్లలో అత్యధిక శాతం సీమ నుంచే ఇచ్చిన జిల్లాలు ఇపుడు జగన్ మోహన్ రెడ్డి వెనక ఎందుకు నిలబడలేదు అన్న ప్రశ్న తలెత్తుతోంది.దానికి కారణం ప్రతిపక్షంలో ఉన్నపుడు మెప్పించిన జగన్ మోహన్ రెడ్డి తీరా అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా అయిదేళ్ల పాలనలో మాత్రం మెప్పించలేక పోయారని అంటున్నారు. జగన్ అన్న మూడు అక్షరాల చూటూ తిరిగిన రాయలసీమ టీడీపీ వైపు తిరిగి  దాదాపు పుష్కరం కాలం తరువాత కొత్త రూపు సంతరించుకున్నట్లుగా కనిపిస్తోంది. జగన్ మోహన్ రెడ్డి ని వీడి సైకిలెక్కుతున్న ఈ జిల్లాలు వైసీపీ ఏలుబడిలో తాము ఏమీ అభివృద్ధి సాధించుకోలేకపోయామని భావించినట్లుగా తెలుస్తుంది.సీఎమ బిడ్డగా జగన్ నే ఎక్కువగా ఆదరించి ఓట్లూ సీట్లూ అప్పగించిన రాయలసీమకు గత అయిదేళ్ళలో న్యాయం జరగలేదు కాబట్టి టీడీపీపై మొగ్గు చూపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: