ఎంపీ సీట్లలో ర్యాంప్ ఆడిస్తున్న కూటమి?

Purushottham Vinay
ఆంధ్ర ప్రదేశ్ లో నేడు ప్రారంభమైన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఎన్డీయే కూటమి బాగా దూసుకుపోతూ దూకుడు చూపిస్తుంది. అధికారిక వైసీపీ పై కూటమి స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ముఖ్యంగా ఎంపీ సీట్లలో కూటమి ఆరంభంలోనే ర్యాంప్ ఆడిస్తూ ఆధిక్యాలు అందుకుంటోంది.ఇప్పటి దాకా అందిన సమాచారం మేరకు అనకాపల్లి, అమలాపురం, విజయవాడ, గుంటూరు ఇంకా శ్రీకాకుళం సీట్లలో కూటమి అభ్యర్ధులు ముందంజలో ఉన్నారు. వీరి ఆధిక్యాలు రౌండ్ రౌండ్ కూ పెరిగిపోతుంటడం విశేషం.విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ (చిన్ని) 5432 ఓట్ల పైగా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గుంటూరు లోక్ సభ స్ధానంలో తెలుగు దేశం పార్టీ అభ్యర్ధి పెమ్మసాని చంద్రశేఖర్ ఆధిక్యంలో ఉన్నారు. 


ఇంకా అలాగే శ్రీకాకుళం లోక్ సభ స్ధానంలో టీడీపీ అభ్యర్ధి కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా లీడ్ లో ఉన్నారు. అటు అనకాపల్లి ఎంపీ సీటులో అయితే బీజేపీ అభ్యర్ధి సీఎం రమేశ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇంకా అలాగే అమలాపురం ఎంపీ సీటులో టీడీపీ అభ్యర్ధి గంటి హరీష్ మాథుర్ ఆధిక్యంలో ఉన్నారు.కూటమి పార్టీలైన టీడీపీ, బీజేపీ ఇంకా అలాగే జనసేన మధ్య ఓట్ల బదిలీ సవ్యంగా సాగినట్లు తాజా ఆధిక్యాలు పూర్తిగా స్పష్టం చేస్తున్నాయి. కూటమిలో పార్టీల మధ్య ఓట్ల బదిలీ జరిగితే ఆ ప్రభావం కచ్చితంగా ఫలితాలపై ఏకపక్షంగా ఉంటుందనే అంచనాలు ఈ రోజు ఖచ్చితంగా ముమ్మాటికి నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో కూటమి ప్రభావం చాలా ఎక్కువగా ఉందని తాజా ఫలితాల ట్రెండ్ చెబుతుంది. ఇదే పరిస్ధితి కొనసాగితే ఎంపీ సీట్లలో జాతీయ మీడియా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఖచ్చితంగా నిజమయ్యేలాగా ఉన్నాయి.ఇక మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ఎంపీ సీట్లలో టీడీపీ కూటమి ర్యాంప్ ఆడిస్తున్న నేపథ్యంలో టీడీపీ తమ్ముళ్లు అప్పుడే సంబరాలు మొదలు పెట్టేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: