అప్పుడూ... ఇప్పుడూ.. ఒక్కడే! కానీ, తన నీడవెంట సేన కదిలింది!!

Pulgam Srinivas
సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కెరియర్ను కొనసాగిస్తూ ఒక్కో సినిమాకి కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకునే స్థాయికి వెళ్లిన పవన్ కళ్యాణ్ 2014 వ సంవత్సరంలో సినిమాల్లో నటించడం కంటే కూడా ప్రజలకు సేవ చేయడం మంచిది అనే ఉద్దేశంతో జనసేన అనే రాజకీయ పార్టీని స్థాపించాడు. కానీ ఆ పార్టీని స్థాపించిన తర్వాత ఎన్నికలకు మధ్య చాలా తక్కువ వ్యవధి ఉండడంతో ఆ ఎలక్షన్లలో పవన్ పోటీలోకి దిగలేదు.

2019 వ సంవత్సరం ఈయన ఎంతో గొప్ప సంకల్పంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రమంతటా ఉన్న అసెంబ్లీ , పార్లమెంట్ స్థానాలలో తన పార్టీ నుండి అభ్యర్థులను నిలబెట్టారు. కానీ ఈ ఫలితాలు పవన్ కళ్యాణ్ కు షాక్ ను ఇచ్చాయి. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ రెండు అసెంబ్లీ స్థానాలలో నిలుచుంటే రెండిట్లో ఓడిపోయాడు. ఇక ఈ పార్టీ నుండి ఒక్క పార్లమెంట్ స్థానం కూడా రాలేదు. అలాగే మొత్తం అసెంబ్లీ స్థానాలలో ఒకే ఒక వ్యక్తి ఈ పార్టీ నుండి గెలుపొందారు. ఇంతలా పెద్ద షాక్ తగిలిన తర్వాత పవన్ ఈ సారి ఎన్నికలలో ఆచితూచి అడుగులు వేశాడు.

అందులో భాగంగా టిడిపి , బిజెపితో పొత్తు పెట్టుకున్నాడు. ఇక ఈ పొత్తులో భాగంగా కూడా పవన్ కళ్యాణ్ కేవలం 21 అసెంబ్లీ , రెండు పార్లమెంటు స్థానాలను మాత్రమే తీసుకున్నాడు. కానీ వీటిని కచ్చితంగా గెలవాలి అని పక్కా ప్రణాళికలను వేసుకున్నాడు. అనుకున్నట్లుగానే పవన్ ఆల్మోస్ట్ సక్సెస్ అయినట్లు కనిపిస్తుంది. 21 అసెంబ్లీ స్థానాలకు గాను జనసేన అభ్యర్థులు 19 స్థానాలలో లీడ్ లో ఉన్నారు. అలాగే పార్లమెంట్ స్థానాలలో కూడా ఈ పార్టీ అభ్యర్థులు మంచి స్థానాలలో కొనసాగుతున్నారు. ఇక ప్రస్తుతం వస్తున్న ఫలితాలను చూసి అప్పుడు అదే పవన్ కళ్యాణ్ , ఇప్పుడు అదే అదే పవన్ కళ్యాణ్.

మరి ఫలితాలలో ఎందుకు ఇంత తేడా అని ఆలోచిస్తున్నారు. ఈ తేడా అంతా కూడా ఈ సారి పవన్ కళ్యాణ్ దృఢ సంకల్పంతో అడుగులు ముందుకు వేయడం , ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం వల్లే జరిగింది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. అలాగే తన బలం అయినటువంటి తన అభిమానులు పూర్తి స్థాయిలో తన వెనుక నడిచారు. ఇలా ఎన్నో పరిణామాల మధ్య ఈ ఎన్నికలలో జనసేన పార్టీ తమ స్టామినాని చూపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: