వైసీపీ: ఆ స్థానాల్లో గెలుపు కత్తిమీద సామే?

Purushottham Vinay
ఆంధ్రప్రదేశ్ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఎన్నడూ కనీవిని ఎరగని రీతిలో ఏకంగా 151 సీట్లను గెలుచుకొని చరిత్ర క్రియేట్ చేసింది. మొదటి సారి 70 సీట్లు, ఆ తర్వాతి ఎలక్షన్లలో 151 సీట్లు గెలిచినా కూడా వైఎస్ జగన్ పార్టీ ఇంత వరకు కూడా బోణి కొట్టని కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి.అయితే ఈ సారి అయిన ఆ సీట్లలో వైసీపీ పార్టీ జెండా ఎరుగుతుందో లేదో చూడాల్సి ఉంది. టెక్కలి, ఇచ్ఛాపురంలో వైసీపీ గెలవలేకపోయింది. విశాఖ ఉత్తరం, విశాఖ దక్షిణం, విశాఖ తూర్పు, విశాఖ పశ్చిమం వంటి నియోజకవర్గాల్లో అయితే మహా దారుణం. అక్కడ కూడా వైఎస్సార్సీపీ జయకేతనం ఎగరవేయలేదు. అలాగే రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, పెద్దాపురం ఇంకా మండపేట నియోజకవర్గాల్లో కూడా జగన్ పార్టీ ఒక్కసారి కూడా సీటు కొట్టలేకపోయింది.


ఇంకా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని రేపల్లె, గుంటూరు వెస్ట్ నియోజకవర్గాల్లో కూడా వైఎస్సార్సీపీ విజయం సాధించలేకపోయింది.ఇకపోతే పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి, పాలకొల్లు వంటి స్థానాల్లో కూడా వైసీపీ జెండా పాతలేకపోయింది. అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గన్నవరం నియోజకవర్గంలో కూడా జగన్ మోహన్ పార్టీ ఏమాత్రం ఖాతా తెరవలేకపోయింది.ఇంకా అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో కూడా జగన్ జెండా పాతలేదు.  ఇంకా సినీ హీరో నందమూరి బాలకృష్ణ పోటీ చేస్తున్న హిందూపురం నియోజకవర్గం కూడా టీడీపీకి కంచుకోటగా ఉంది. ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా వైఎస్సార్సీపీ గెలవలేకపోయింది.కత్తి మీద సాము అన్నట్లుగా ప్రస్తుతం వైసీపీ పరిస్థితి మారింది. ఈసారి ఫలితాలు చూస్తుంటే వైసీపీకి అంత ఈజీ కాదని అనిపిస్తుంది. టీడీపీ ప్రస్తుతం ముందంజలో దూసుకుపోతుంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈసారి ఖచ్చితంగా వైసీపీ మీద టీడీపీ అధిక్యంలో దూసుకుపోయి గెలిచే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: