పిఠాపురం: పవర్ స్టార్ పవర్ మాములుగా లేదుగా!

Purushottham Vinay
పిఠాపురం పోస్టల్ బ్యాలెట్‌లో పవర్ స్టార్ తన పవర్ ని చూపిస్తున్నారు. పవన్ కల్యాణ్‌కు ఏకంగా 1,000 ఓట్లు లీడ్ వచ్చినట్లు తెలుస్తోంది.2008లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. తన అన్న మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజా రాజ్యం పార్టీకి యువ విభాగానికి అధ్యక్షునిగా ఉన్నాడు. ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిన తర్వాత పవన్ ఆ పార్టీని వదిలి పెట్టాడు. 2014 మార్చిలో పవన్  జనసేన పార్టీ స్థాపించాడు. 2014 ఎన్నికల్లో బీజేపీతో కలిపి చంద్రబాబు నాయుడు నేతృత్వంలవోని టీడీపీకి తన పార్టీ మద్దతుని తెలిపాడు. 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో జనసేన పార్టీ ఏకంగా 140 నియోజక వర్గాల నుంచి ఒంటరిగా పోటీ చేసింది. అయితే పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ గాజువాక ఇంకా భీమవరం నియోజక వర్గాల నుంచి పోటీ చేసాడు. భీమవరంలో అయితే పవన్ కళ్యాణ్‌కి 62,285 ఓట్లు, గాజువాక నియోజకవర్గంలో మొత్తం 58,539 ఓట్లు వచ్చాయి. రెండు స్థానాలలో కూడా వైసీపీ అభ్యర్థుల చేతిలో పవన్ ఓటమి పాలయ్యాడు. ఆయన పార్టీ ఈ ఎన్నికలలో ఒక్క రాజోలు నియోజకవర్గం నుంచి మాత్రమే గెలుపొందింది.2020 జనవరి 16వ తేదీన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ బీజేపీతో మరోసారి పొత్తు పెట్టుకున్నట్లు ప్రకటించాడు. 2024లో జరగబోయే ఎన్నికలలో రెండు పార్టీలతో కలిసి పోరాడుతాయని ప్రకటించాడు.


అయితే ఆ తర్వాత రాష్ట్రంలో జరిగిన అనూహ్య రాజకీయ మార్పులు, టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్ కావడంతో పవన్ కళ్యాణ్ తన మద్దతును టీడీపీకి ఇచ్చాడు. ఆ తర్వాత టీడీపీ ఇంకా బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకుని ఈ ఎన్నికల్లో పోటీ చేసింది. పొత్తులో భాగంగా రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లో జనసేన పార్టీ 21 అసెంబ్లీ ఇంకా అలాగే 2 లోక్‌సభ స్థానాల్లో మాత్రమే పోటీ చేసింది.ఇక వంగా గీత విషయానికి వస్తే 1983లో రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. ఆమె 1985 నుంచి 87 దాకా మహిళా శిశు సంక్షేమ రీజనల్‌ చైర్‌ పర్సన్‌గా, 1995లో కొత్తపేట జెడ్పీటీసీగా, 1995 నుంచి 2000 దాకా తూర్పు గోదావరి జిల్లా జెడ్పీ చైర్‌ పర్సన్‌గా పని చేసింది. వంగా గీత 2000 నుంచి 2006 దాకా రాజ్యసభ సభ్యురాలిగా, 2009 నుంచి 2014 దాకా పిఠాపురం ఎమ్మెల్యేగా పని చేసింది. 2019లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కాకినాడ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచింది. వంగా గీత 1983 నుంచి 2008 దాకా టీడీపీ పార్టీలో, 2008 నుంచి 2011 దాకా ప్రజారాజ్యం పార్టీలో, 2011 నుంచి 2014 దాకా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆ తర్వాత వైసీపీలో చేరిన గీత.. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి పోటీగా నిలిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: