విశాఖ: దూసుకెళ్తుంది ఎవరు? జెండా ఎగరేసేది ఏ పార్టీ?

Purushottham Vinay
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది. మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాల్లో పోస్ట్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపనేది జరుగుతోంది.పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు హడావుడి ముగిసేసరికి ఏపీలో అధికారం పీఠం దక్కించుకునేదెవరో ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. విశాఖ జిల్లాలో ఏ పార్టీల అభ్యర్థులు లీడ్ లో ఉన్నారు...ఎవరు విజేతగా నిలుస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.2019లో రాష్ట్రవ్యాప్తంగా కూడా వైసీపీ గాలి వీచినా విశాఖపట్నంలో మాత్రం ఆ పార్టీ ఇప్పటికీ బోణీ కొట్టలేకపోయిందంటే...తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఎంత స్ట్రాంగ్గా అయ్యిందో పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. మొదటి నుంచి తెలుగుదేశానికి కంచుకోటగా ఉన్న విశాఖ జిల్లాలో 2009 కాంగ్రెస్ ప్రభావం గట్టిగా చూపింది. ఆంధ్ర రాష్ట్ర విభజన తరువాత జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయ దుందిబి మోగించింది.2014 వ సంవత్సరంలో విశాఖ లోక్సభ పరిధిలోని అసెంబ్లీ సీట్లను పొత్తులో భాగంగా బీజేపీతో కలిసి క్లీన్స్వీప్ చేసింది. మొత్తం అసెంబ్లీ సీట్లతోపాటు విశాఖ లోక్సభ అభ్యర్థి బీజేపీ గెలుపు సాధించింది.


ఆ తర్వాత 2019 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా జగన్ మోహన్ రెడ్డి హవా నడిచినా విశాఖలో మాత్రం అంతగా ప్రభావం చూపలేకపోయారు. కేవలం రెండు సీట్లని మాత్రమే ఆ పార్టీ గెలుచుకుంది. ముఖ్యంగా విశాఖ నగరంలో ఒక్క సీటు కూడా తెలుగు దేశం పార్టీకి దక్కలేదు. అయితే ఇక్కడ నాలుగు సీట్లు తెలుగుదేశం పార్టీ గెలుచుకోవడం విశేషం.చంద్రబాబు హయాంలో విశాఖలో జరిగిన అభివృద్ధిని వారు కళ్లారా చూడటం, అంతర్జాతీయ సంస్థలు రావడం, ఐటీ గ్రోత్ పెరగడం, పారిశ్రామిక సదస్సులు నిర్వహించడం...ఇలా తెలుగుదేశం హయాంలో ఏ పెద్ద ఈవెంట్ జరిగినా ముందుగా గుర్తుకు వచ్చేది విశాఖ పేరే. అందుకే నగరవాసులు తెలుగుదేశానికి పట్టం కట్టారని తెలుస్తుంది. కానీ జనసేన నుంచి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ బరిలో నిలవడంతో ఎంపీ సీటుకు గట్టిపోటీ వచ్చింది. పెద్దఎత్తున తెలుగుదేశం ఓట్లు చీలిపోవడంతో ఆ పార్టీ అభ్యర్థి శ్రీభరత్ స్వల్ప తేడాతో ఎంపీ సీటు కోల్పోవడం జరిగింది. రెండు పార్టీల మధ్య ఓట్లనేవి చీలి వైసీపీ లాభపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: