చెఫ్ కారణంగా బయటపడ్డ చైతు ప్రేమాయణం.. ఫొటోస్ వైరల్..!

lakhmi saranya
అక్కినేని హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. అంతేకాకుండా నాగచైతన్య, క్యూట్ బ్యూటీ శోభిత దూదిపాల్ల రిలేషన్ లో ఉన్నట్లు సోషల్ మీడియాలో గత కొంతకాలం నుంచి ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతతో నాగచైతన్య విడాకులు తీసుకోవడానికి కారణం కూడా శోభిత తో ఉన్న రిలేషన్ అని నెట్టింట టాక్ కూడా వినిపించింది.
అంతేకాకుండా ఈ మధ్యకాలంలో వీరిద్దరూ ఒకే దగ్గర ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. వీటికి తోడు నాగచైతన్య, శోభిత విడివిడిగా ఫోటోలు షేర్ చేసినప్పటికీ లోకేషన్ మాత్రం సేమ్ ఉండడంతో కలిసి వెళ్లి విడిగా ఫోటోలు షేర్ చేస్తున్నారా అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరోసారి వీరిద్దరూ వార్తల్లో నిలిచారు. గతంలో నాగచైతన్య మరియు శోభిత లండన్ వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ ఒక చెఫ్ నాగచైతన్య తో ఫోటోలు దిగిన క్రమంలోనే వెనుక ఫేస్ కవర్ చేసుకునే శోభిత కనిపించింది. దీంతో రూమర్స్ మరింత చెలరేగాయి.
అయితే ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చైతు, శోభిత పై నెట్టింట‌ నెగిటివిటీ పెరిగింది. సమంత అభిమానులు అయితే ఈ జంటని ఘోరంగా ఏకేస్తున్నారు. ఆరు సంవత్సరాలు ప్రేమించిన సమంత కనిపించలేదు కానీ మొన్న వచ్చిన శోభిత తో ఎఫైర్ నడుపుతున్నావా చైతు? ఇది పద్ధతి కాదు? సమంతా కి అన్యాయం చేశావు? ఆమె ఉసురు నీకు తప్పక తగులుతుంది.. అంటూ ఫైర్ అవుతున్నారు సమంత ఫ్యాన్స్. ఇక ప్రజెంట్ నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా తండెల్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు వరుస ఫ్లాప్స్ తో ఉన్న చైతు ఈ మూవీతో అయినా సక్సెస్ అందుకుంటాడో లేదో చూడాలి.నాగచైతన్య తో ఫోటోలు దిగిన క్రమంలోనే వెనుక ఫేస్ కవర్ చేసుకునే శోభిత కనిపించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: