ఏపీ రిజల్ట్: పీకే చెప్పిందే నిజమా.. ఇంతకన్నా సాక్ష్యం కావాలా..?
వైసీపీ ఓడిపోతుందని ఆయన చెప్పలేదు. కానీ.. భారీ దెబ్బ తగులుతుందనని మాత్రం ప్రశాంత్ కిషోర్.. ఉరఫ్ పీకే వెల్లడించారు. ఆయన ఈ మాట పదే పదే అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు. హైదరాబాద్, ఢిల్లీ వేదికలపైనా.. పీకే తన అభిప్రాయాన్ని బల్లగుద్దినట్టు చెప్పారు. దీంతో వైసీపీనాయకులు ఎదురుదాడి చేశారు. ఆయనను టీడీపీ తనకు అనుకూలంగా మార్చుకుందని అందుకే టంగ్ మారిందని కూడా.. చెప్పుకొచ్చారు.వాస్తవానికి పీకే చెప్పింది ఏంటంటే.. జగన్‌కు మెజారిటీ తగ్గుతుందని!
2019 విల్ నెవర్ రిపీట్.. జగన్ రెడ్డి లాస్ టూ మచ్ ఆఫ్ హిజ్ పార్టీ! అని ప్రశాంత్ కిషోర్ పదే పదే చెప్పా రు. దీనికి అనేక మంది అనేక భాష్యాలు చెప్పుకొచ్చారు. ఇంకేముంది. జగన్ ఓడిపోతున్నట్టు ప్రశాంత్ కిషో రే వెల్లడించారని చెప్పిన వారు కూడా ఉన్నారు. కానీ, ఆయన చెప్పింది..ఉచితాలు మాత్రమే పనిచేయవు .. ఉపాధి, ఉద్యోగ కల్పన కూడా అత్యంత అవసరం.. ఇవి లేకుండా.. కేవలం డబ్బులు ఇస్తేనే ఓట్లు పడవు.. అన్నారు. అంతేకాదు.. సీఎం జగన్ కేవలం మేనేజర్‌గా మాత్రమే ఉన్నారని చెప్పారు. దీంతో వైసీపీకి దెబ్బ తగులుతుందని మాత్రం పీకే చెప్పడం గమనార్హం.
అయితే... ఇప్పుడు తాజాగా వచ్చి న ఎగ్జీట్ పోల్స్ సర్వేల్లోనూ ఇదే స్పష్టంగా తెలిసింది. ఎక్కడా కూడా.. గత ఎన్నికల ఫలితాలు వస్తాయయ ని ఎవరూ చెప్పలేదు. ఒక్క ర్యాప్‌కు మాత్రమే మినహాయింపు. మిగిలిన వారిలోనూ వైసీపీకి అనకూలంగా చెప్పిన కొన్ని సర్వేలు కూడా.. 95-105, 110-120 సీట్ల మధ్యే అంచనాలు వేశాయి. అంటే.. మొత్తంగా 2019 రిజల్ట్ అయితే.. రిపీట్‌కాదు. ఇది ఒక రకంగా.. భారీ దెబ్బే. 2019లో 151 సీట్లు దక్కించుకున్న పరిస్థితి ఖచ్చితంగా ఇప్పుడు ఉండదనని తేల్చాయి. సో.. ప్రశాంత్ కిషోర్ చెప్పింది కూడా ఇదే కదా!! దీనిని బట్టి. ఆయన చెప్పింది ఏపీ విషయంలో మరోసారి నిజం కానుందన్నమాట.