ఏపీ: కుడి భుజం లాంటి ఐఏఎస్ అధికారిని జగన్ ఎందుకు వదిలేశారు..??

Suma Kallamadi
జగన్‌కు కుడి భుజంగా ఉన్న సీనియర్‌ ఐఏఎస్ అధికారి, సీఎం అదనపు కార్యదర్శి కె.ధనుంజయ రెడ్డి 2024, మే 31వ తేదీన రిటైర్ అయిన సంగతి తెలిసిందే. ఆయన తన సర్వీసును ఎక్స్‌టెండ్ కూడా చేసుకోలేదు. జగన్ కావాలనుకుంటే ఆయన పదవీ కాలాన్ని పొడిగించే వారిని కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మరొక కొత్త వార్త తెరపైకి వచ్చింది. కె.ధనుంజయ రెడ్డి నాన్ క్యాడర్ సివిల్ సర్వీస్ ఆఫీసర్. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ప్రాంతంలో ఆయన విధులు నిర్వర్తించేవారు. అయితే 2006 ప్రాంతంలో అధికారంలో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి ధనుంజయ రెడ్డిని ఏపీకి తీసుకొచ్చి ఐఏఎస్ పదోన్నతి ఇచ్చారు.
ఆ తర్వాత 2019లో అధికారంలోకి రాగానే ఈ ఐఏఎస్ అధికారిని జగన్ తన దగ్గర పెట్టుకున్నారు. తనకు అదనపు కార్యదర్శిగా ఓ ఉన్నత హోదా కూడా కల్పించారు. ఆ సమయం నుంచి ధనుంజయ రెడ్డి ఏపీలో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. సీఎంఓ ఆఫీసులో ఆయన ఒక కింగ్‌లా కొనసాగారు అంటే అతిశయోక్తి కాదు. అంతేకాదు అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా కీ రోల్‌ ప్లే చేశారు.
అయితే అంతటి కీలకమైన వ్యక్తి పదవీకాలం పొడిగించాలని కేంద్రాన్ని జగన్ అడుగుతారని టీడీపీ భావించింది కానీ అలా జరగలేదట. దాంతో ఆయన పదవీ విరమణ పొందారు. ఆయన స్థానంలో ఆల్టర్నేటివ్ గా వేరొక ఆఫీసర్ ని తీసుకోవాలని సీఎంఓ ఆఫీస్ కు ఆల్రెడీ అధికారులు తెలియజేసినట్లు తెలిసింది. కాగా జగన్ ధనుంజయ రెడ్డిని వదిలేయడానికి ఒక కారణం ఉందని టిడిపి వాళ్ళు చెబుతున్నట్లుగా టాక్ నడుస్తోంది. ఆ కారణం ఏమిటంటే జగన్ ఈసారి కచ్చితంగా ఓడిపోతానని భయపడ్డారట. వైసీపీ ఓడిపోతున్నప్పుడు ఆయనకు పదవీ కాలాన్ని పొడిగించడం వల్ల ఆయనకే రిస్కు. ఎందుకంటే సర్వీస్ లో ఉన్న ధనుంజయ రెడ్డిని టీడీపీ బాగా టార్గెట్ చేస్తుంది. ఆ వయసులో ఆయనకు ఇబ్బందులు ఎందుకు అని, "మేం ఓడిపోతున్నాం మీరు కూడా హాయిగా పదవి విరమణ తీసుకోండి" అన్నట్లు జగన్ ఆయనకు చెప్పారట. ఒకవేళ గెలిస్తే మళ్ళీ కీలకమైన ఏదో ఒక పదవి ఇస్తానని కూడా హామీ ఇచ్చారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: