ఏపీ: ఎగ్జిట్ పోల్ అంచనాలతో బెట్టింగ్ బాబాయ్ ల సంబరాలు!

Suma Kallamadi

ఎగ్జిట్ పోల్స్ అంచనాలు రావడంతో బెట్టింగ్ బాబాయ్ ల సంబరాలు అంబరాన్నంటాయి. మరీ ముఖ్యంగా ఏపీ రాష్ట్రంలో కూటమి గెలుస్తోందని బెట్టింగ్ రాయుళ్లు జోరుగా పందేలు కాశారు. వారి జోశ్యం ఫలించడంతో పండగ చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది రాష్ట్రంలో. కాగా తాజాగా జరుగుతున్న బెట్టింగ్ పరిణామాలను గమనిస్తే గతంలో కాసిన పందేనికి రూపాయికి రెండు రూపాయలు ఇస్తామని ముందుకొస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాల తర్వాత కూటమి విజయంపై బెట్టింగ్ రాయుళ్ల ఆత్మవిశ్వాసం పెరిగినట్టుగా కొట్టొచ్చినట్టు కనబడుతోంది. ఇక ట్రెండ్ గమనించిన ప్రత్యర్థులు వెనకడుగు వేస్తున్నారు.
అవును, వైసీపీకి అనుకూలంగా బెట్టింగ్ కాసేందుకు జనాలు ముందుకు రావడం లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. కూటమి విజయం గురించి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు విదేశాల్లో కూడా బెట్టింగ్ కాస్తుండడం ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు. ఇక కూటమికి మెజార్టీ సర్వే సంస్థలు మొగ్గు చూపడంతో ఒకటికి 2 రూపాయలు ఇస్తామని ఆఫర్ చేస్తున్నారు. అయినప్పటికీ కొందరు ముందుకు రావడం లేదని గుసగుసలు వినబడుతున్నాయి. అదంతా ఒకెత్తయితే గతంలో కట్టిన పందేల డబ్బులను కూడా వెనక్కి తీసుకుంటున్నారని విశ్వసనీయ సమాచారం. వాస్తవానికి అలా డబ్బులు తిరిగి వెనక్కి ఇవ్వరు. 10 శాతం నగదు వదిలేసుకొని మరి తీసుకుంటున్నారని తెలిసింది.
ఇకపోతే, గుడివాడలో తెలుగుదేశం పార్టీ నుంచి వెనిగండ్ల రాము బరిలో ఉన్నారన్న సంగతి విదితమే. నానిపై ఉన్న వ్యతిరేకతను రాము చాలా క్లియర్ కట్ గా క్యాష్ చేసుకున్నారని సమాచారం. దాంతో గుడివాడలో కూటమి అభ్యర్థి విజయం ఖాయం అని దాదాపుగా ఖరారు అయింది. దాంతో ఆ ధీమాతోనే బెట్టింగ్ రాయుళ్లు విరివిగా పందేలు కాస్తున్నారు. ఇక గన్నవరంలో టీడీపీ అభ్యర్థిగా సీనియర్ నేత యార్లగడ్డ వెంకట్రావు ఉన్నారు. ఇక్కడ వెంకట్రావు వైపు జనం మొగ్గుచూపారని చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే గుడివాడ, గన్నవరంలో కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారని జోరుగా బెట్టింగ్స్ జరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: