ఏపీ: ఈటీవీ ఎంత నష్టపోయిందో తెలిస్తే షాక్ అవుతారంతే...??

Suma Kallamadi
అతియే అన్ని అనర్థాలకు మూలం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎవరైనా సరే అతి చేస్తే చివరికి నాశనం అయిపోవాల్సిందే. జబర్దస్త్ కూడా అలానే పతనమయింది ఇదొక కామెడీ షో ఇందులో ఒకప్పుడు సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, చమ్మక్ చంద్ర, బుల్లెట్ భాస్కర్, రాఘవ లాంటి కమెడియన్లు మంచి పద్ధతి అయిన స్కిట్లు చేసేవారు వాటిని ఫ్యామిలీ వాళ్లు కూడా చూస్తూ బాగా నవ్వుకునేవారు. దీనివల్ల ఈ షోకు బాగా రేటింగ్స్ వచ్చాయి. అయితే కొంచెం అతిగా డబ్బులు మీనింగ్ డైలాగ్స్ పెట్టి ఇంకా ఎక్కువ రేటింగ్స్ పొందాలని ఉద్దేశంతో ఈటీవీ ఎక్స్‌ట్రా జబర్దస్త్ షో కూడా ప్రారంభించింది.
 అయితే ఇందులో మొత్తం నాసిరకమైన, అసభ్యకరమైన డబ్బులు మీనింగ్ డైలాగ్స్ వాడటం మొదలుపెట్టారు ఇక హైపర్ ఆది వచ్చాక మింగటం, గువ్వ వంటి అతి దారుణమైన పదాలను యూజ్‌ చేయడం స్టార్ట్ అయ్యింది. ఆడవాళ్ళపై కూడా బూతులు వాడటం మొదలుపెట్టారు. ఇక బాడీ షేమింగ్ సరే సరి. ఫ్యామిలీలో చూడగల పద్ధతి అయినా కామెడీ స్కిట్లు ఇందులో కనుమరుగయ్యాయి. ఇది ఒక అడల్ట్ షో గా మారిపోయింది. ఇక ఇతరులను టార్గెట్ చేయడానికి కూడా ఇది ఒక వేదిక అయింది జగన్ లాంటి వారిని కూడా ఇక్కడ ఇమిటేట్ చేస్తూ, లేదంటే ఆయనను అపహాస్యం చేస్తూ స్కిట్లు చేసిన సందర్భాలు ఉన్నాయి.
జనాలు ఇలాంటి వాటిని ఎప్పుడూ ఆదరించరు. దానివల్ల వ్యూయర్ షిప్ అనేది దారుణంగా పడిపోయింది. కట్ చేస్తే ఈటీవీ ఎక్స్‌ట్రా జబర్దస్త్ షో పూర్తిగా ఎత్తేయాల్సిన దుస్థితి వచ్చింది. ఇది పోయినా కూడా శ్రీదేవి డ్రామా కంపెనీ, తదితర టీవీ షోలను ఈటీవీ ప్రారంభించింది. అక్కడ కూడా వెకిలి స్కిట్లు, వెకిలి చేష్టలతో డైలాగులు పెడుతూ ప్రేక్షకులకు విసుగు తెప్పించింది. ఇప్పుడు వీటికి టీఆర్‌పీ రేటింగ్స్ చూసుకుంటే 3, 4, 5 ఆ రేంజ్‌లోనే ఉంటున్నాయి. ఇక జబర్దస్త్ షోకి 3 కూడా రేటింగ్స్ దాటలేదు. ఇటీవల రిలీజ్ అయిన టీఆర్‌పీ రేటింగ్స్ ప్రకారం 2.74 అలా మాత్రమే ఈ షోలకు రేటింగ్స్ వచ్చాయి. సుమ అడ్డా, ఆలీతో సరదాగా షోలకైతే రెండు కంటే తక్కువే రేటింగ్స్ వచ్చాయి. అంటే ఊరు పేరు లేని ఛానెల్స్‌తో సమానంగా ఈటీవీ ప్రోగ్రామ్స్‌కు రేటింగ్స్ వస్తున్నాయి. ఈ లెక్కన చూసుకుంటే ఈటీవీ అంత నష్టపోయిందో అర్థం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: