లోకేష్: అసెంబ్లీ ఎంట్రీ ఇస్తే తలబడతాడా? తడబడతాడా?

Purushottham Vinay
•టీడీపీ గెలిస్తే లోకేష్ అసెంబ్లీ ఎంట్రీపై నెట్టింట చర్చ

•అసెంబ్లీలో అడుగు పెడితే లోకేష్ ప్రతి పక్షాలతో తలబడగలడా? అంటున్న నెటిజన్స్

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మూడు శాఖల మాజీ మంత్రి, మాజీ సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌కు ఇప్పుడు పెద్ద పరీక్షా సమయమిది. మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసిన ఆయన ఈసారైనా గెలిచినట్లయితే ఊపిరి పీల్చుకున్నట్లే. లేదంటే రాజకీయంగా అధోగతే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. పోలింగ్‌ తరువాత విభిన్న కోణాల్లో వేసుకుంటున్న అంచనాలలో అంతర్గత అనుమానాలు ఎన్నో ఉన్నప్పటికీ బయటకు మాత్రం టీడీపీ గెలుపుపై మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోందని తెలుస్తోంది. ఆంధ్ర రాష్ట్ర విభజన తరువాత అధికారంలోకి వచ్చి అమరావతిని రాజధాని కేంద్రంగా ప్రకటించి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాన్ని విస్తతపరచిన నాటి పాలకపక్షానికి గుంటూరు, కష్ణా జిల్లా ప్రజలు బాగానే బుద్ధి చెప్పారు.

2019 సాధారణ ఎన్నికల్లో, ఆ తరువాత జరిగిన గుంటూరు, విజయవాడ కార్పొరేషన్‌ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి షాక్ ఇచ్చారు. కరకట్ట వెంట అక్రమ కట్టడంలో నివాసం ఉంటూ వచ్చిన అప్పటి సీఎం చంద్రబాబునాయుడు, ఏ ఎన్నికల్లో కూడా పోటీ చేయకుండానే ఎమ్మెల్సీగా ఎంపికై మూడు శాఖల మంత్రిగా కొనసాగిన లోకేష్‌ మంగళగిరి నియోజకవర్గానికి ప్రత్యేకంగా చేసిందంటూ ఏమీలేదనే విమర్శలు అప్పట్లోనే బాగా హల్ చల్ చేసాయి. 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి ఆళ్ల రామకష్ణారెడ్డి(ఆర్కే) చేతిలో దారుణమైన పరాజయం పాలైన లోకేష్‌ ఆ తరువాత అయినా రాజకీయంగా వ్యూహాత్మక అడుగులు వేశారా అంటే అది కూడా లేదు.మరి ఈసారి లోకేష్ గెలుస్తాడో లేడో చూడాలి.

నిజానికి లోకేష్ తన ప్రసంగాలతో సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యారు. అయితే ఈసారి తెలుగుదేశం పార్టీ గనుక గెలిస్తే లోకేష్ బాబు అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయం. అయితే అసెంబ్లీ ఎంట్రీ ఇచ్చాక లోకేష్ బాబు ఎలా మాట్లాడతారనే దానిపై ప్రస్తుతం నెట్టింట చర్చ జరుగుతుంది. ఎందుకంటే లోకేష్ ప్రచార సభల్లో కానీ ప్రెస్ మీట్లలో కానీ మాట్లాడేటప్పుడు సహజంగా తడబడుతూ ఉంటాడు. అందుకు ఆయన్ని ప్రతిపక్షాలు, నెటిజన్స్ చాలా ఘోరంగా ట్రోల్ చేశారు. అయితే గత కొంతకాలం నుంచి లోకేష్ బాబు కొంచెం ఇంప్రూవ్ అయ్యాడు. మాట్లాడటం నేర్చుకున్నారు. మునుపటిలా తడబడట్లేదు. మరి లోకేష్ బాబు అసెంబ్లీ ఎంట్రీ ఇస్తే తడబడతాడో లేదా తలబడతాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: