ఎగ్జిట్ పోల్స్ వచ్చినా అయోమయంలోనే ఏపీ ప్రజలు, రాజకీయ నేతలు..??

Suma Kallamadi
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 4వ తేదీన విడుదల కానున్నాయి. అయితే దీనికంటే ముందే సర్వేలు ఎగ్జిట్ పోల్స్ ద్వారా ఎవరికి గెలుస్తారనే దానిపై ఫుల్ క్లారిటీ వస్తుందని చాలామంది అనుకున్నారు కానీ ఏ ఒక్క సర్వే కూడా కచ్చితంగా ఎన్ని సీట్లు వైసీపీ లేదా టీడీపీ గెలుచుకుంటుందో చెప్పలేకపోయాయి. ఇక నిన్న విడుదలైన ఎగ్జిట్ పోల్స్ కూడా వాస్తవానికి చాలా దూరంగా ఫలితాలను వెల్లడించాయి. దీనివల్ల ఏపీ ప్రజలు మరింత అయోమయంలో పడ్డారు. ఇక రాజకీయ నేతల పరిస్థితి కూడా అలాగే తయారైంది.
 అయితే ఒకటి మాత్రం నిజం అదేంటంటే ఈసారి వైసీపీకి పోయినసారి కంటే సీట్లు తగ్గనున్నాయి. అంతే కాదు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోయినసారి కంటే ఎక్కువ సీట్లను తప్పనిసరిగా గెలుచుకోబోతున్నాయి. కానీ కూటమి అధికారంలోకి వస్తుందా? అంటే ఎవరూ కూడా కాన్ఫిడెంట్ గా చెప్పలేకపోతున్నారు. ఈనాడు టీవీ 5 ఆంధ్రజ్యోతి వంటి సంస్థలు 130 నుంచి 161 దాకా తమకు వస్తాయన్నట్లు చెబుతున్నాయి కానీ వాటిని నమ్మే వారే లేరు. అయితే ఈసారి ఇండియా టుడే కూడా టిడిపి వైపే మొగ్గు చూపిస్తూ సర్వే ఫలితాలను వెల్లడించింది ఇండియా టుడే ప్రకారం ఏపీలో ఎన్‌డీఏ ఏకంగా 15 సీట్లు గెలుచుకుంటుందట. వైసీపీ మాత్రం 3-4 సీట్లకే పరిమితం అవుతుందట. అయితే టైమ్స్ నౌ మాత్రం వైసీపీ 15, టీడీపీ 11 ఎంపీ సీట్లను గెలుచుకోబోతుందని తెలిపింది. అంటే ఇది నమ్మడానికి కాస్త దగ్గరగా ఉంది. నెక్ టు నెక్ హైట్ ఉన్నట్లు ఈ సర్వే తెలిపింది బహుశా అలా రావచ్చు ఎందుకంటే ఎంపీ అభ్యర్థులు బీజేపీ, టీడీపీలలో కాస్త బలంగానే ఉన్నారు.
 ఏది ఏమైనా ఈసారి అన్ని సంస్థలు కన్ఫ్యూజన్ లో ఎలా పడితే అలా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రకటించాయి. వీటివల్ల ప్రజలు మరింత కన్ఫ్యూషన్ లో పడిపోయారు. దీంతో ఎన్నికల ఫలితాల కోసం నాలుగో తేదీ దాకా వెయిట్ చేయడం తప్ప ఏపీ ప్రజలకు మరొక మార్గం కనిపించడం లేదు ఇంకా ఒక్కరోజు ఓపిక పడితే మరుసటి రోజు పోలింగ్ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 2:00 లోగా ఎవరు గెలుస్తారని దానిపై పూర్తి క్లారిటీ వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: