ఎగ్జిట్ పోల్ అంటే ఏంటి? ఎలా లెక్కిస్తారు?

Purushottham Vinay
దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. దీంతో ఎగ్జిట్ పోల్స్‌కు మరోసారి వేళయింది. మరి ఎగ్జిట్ పోల్స్ అంటే ఏమిటి? వాటిని ఎలా నిర్వహిస్తారు? ఎగ్జిట్ పోల్స్ చెప్పే లెక్కలు ఎంతవరకు నిజం అవుతాయి? ఇప్పుడు తెలుసుకుందాం..పోలింగ్ తర్వాత... ఫలితాలకు ముందు ఆయా సర్వే సంస్థలు ఇంకా మీడియా సంస్థల అంచనాలనే ఎగ్జిట్ పోల్స్ అంటారు. పోలింగ్‌కు ముందు వివిధ వర్గాల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం వెలువరించే అంచనాలను ప్రీ పోల్ సర్వే అంటారు.ఎన్నికల సర్వేలకు అభివృద్ధి చెందిన దేశాల్లో నిర్వాహకులు ఫోన్, ఇతర సాధనాలపైనే ఎక్కువగా ఆధారపడతారు. ఇండియాలో ఓటర్లను చాలా వరకు నేరుగా, క్షేత్రస్థాయిలో కలుస్తారు. ఎలక్షన్స్‌లో భాగంగా కొన్ని మీడియా సంస్థలతో పాటు మరికొన్ని స్వచ్ఛంద సంస్థలు ప్రి పోల్స్, ఎగ్జిట్ పోల్స్ అనే రెండు రకాల సర్వేలు జరుపుతుంటాయి. పోలింగ్ జరగడాని కంటే ముందు నిర్వహించే సర్వేలను ప్రీపోల్స్ అని అంటారు. అంటే ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందు, పొత్తుల అంశం తేలక ముందు, సీట్ల సర్దుబాటుపై స్పష్టత రాకముందు, పార్టీలు అభ్యర్థులను ప్రకటించక ముందు ఇంకా పోలింగ్ తేదీకి చాలా రోజుల ముందు, లేదా పోలింగ్ తేదీ సమీపించినప్పుడు నియోజకవర్గాల వారీగా ఈ ప్రీ పోల్ సర్వే జరుపుతారు.ఇందులో భాగంగా కొంతమంది ఓటర్లను ర్యాండమ్‌గా సెలెక్ట్ చేసుకుని సర్వే చేస్తారు. అలా ఓటర్లతో మాట్లాడి.. ఏ పార్టీకి గెలుపు ఎక్కువ ఉందనే విషయాన్ని సేకరించి పోల్ ఫలితాలు వెల్లడిస్తారు.


ఎగ్జిట్ పోల్ సర్వే ఇంకా ప్రి పోల్స్ సర్వేకు చాలా తేడా ఉంది. ప్రీపోల్ సర్వేలో రైతులు,ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు, యువత, దివ్యాంగులు, ముసలివారు, మహిళలు, కులం, మతం, పేద, మధ్యతరగతి వంటి వర్గాలను ఎంచుకుని సర్వే చేస్తారు. ఎగ్జిట్ పోల్స్ అలా కాదు పోలింగ్ రోజే ఓటు వేసేందుకు వచ్చిన వారిని మాత్రమే ప్రశ్న వేసి సమాధానం రాబడతారు. అందుకే... ప్రీ పోల్ సర్వేలతో పోలిస్తే ఎగ్జిట్ పోల్స్‌లో కచ్చితత్వానికి ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది.పోలింగ్ జరిగే సమయంలో ఈ ఎగ్జిట్ పోల్ జరుపుతారంటే...ఎంపిక చేసిన పోలింగ్ కేంద్రాలకు ఆయా సంస్థల ప్రతినిధులు వెళ్తారు. వారు అక్కడ ఉన్న ఓటర్లు ఎక్కువమంది ఏ పార్టీకి ఓటు వేస్తారో తెలుసుకొని ఒక అంచనాకు వస్తారు. ఆ పోలింగ్ కేంద్రాల్లో తెలుసుకున్న సమాచారంతో ఏ నియోజవర్గంలో ఏ పార్టీ విజయం సాధించే ఛాన్స్ ఎక్కువగా ఉందో ఓ నిర్ణయానికి వస్తారు. అలా నియోజవర్గాల వారిగా వచ్చిన సర్వేతో ఏ పార్టీకి ఎన్ని సీట్లనేవి వస్తాయో ఓ అంచనాకు వస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: