ఆంధ్రాలో ఫస్ట్ రిజల్ట్ అదే...చివరగా వచ్చేది ఎక్కడంటే ?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఫలితాల కోసం అందరూ ఉత్కంఠ భరితంగా ఎదురుచూస్తున్నారు. జూన్ 4వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు విడుదలవుతాయి. దీంతో ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఫలితాలకు నాలుగు రోజుల సమయం ఉన్న నేపథ్యంలో... విదేశాలకు వెళ్లిన నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఇండియాకు వచ్చేశారు.

 
 ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా ఏపీకి వస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికే వచ్చినట్లు తెలుస్తోంది. అయితే జూన్ 4వ తేదీన... ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్న నేపథ్యంలో... ఏ నియోజకవర్గ ఫలితాలు మొదటగా వస్తాయని... అందరూ ఆత్రుతగా చూస్తున్నారు. ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం నుంచి ఉదయం 11 గంటల సమయం వరకు.. ఏపీలో ఫ్రెండ్ ఎలా ఉంది అనే దానిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది.

 
 మధ్యాహ్నం వరకు... ఏ ప్రభుత్వం రాబోతుందో కూడా తెలియబోతుంది. అయితే ఏపీలో మొట్టమొదటగా... పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం  నియోజకవర్గ ఫలితం  వచ్చే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ తర్వాత కొవ్వూరు నియోజకవర్గ ఫలితం వస్తుంది. ఈ రెండు నియోజకవర్గాలలో 13 రౌండ్లలోనే... ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. అందుకే మొదటగా ఈ రెండు నియోజకవర్గ ఫలితాలు  బయటపడతాయి.

 
 ఇక చివరిగా... అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం, తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ ఫలితాలు... అర్ధరాత్రి వరకు రిలీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ రౌండ్ల  కౌంటింగ్ ఎక్కువసేపు జరుగుతుంది. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం, జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల  నియోజకవర్గాలలో మధ్యాహ్నము రెండు గంటల వరకు ఫలితం తేలిపోతుంది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం ఫలితం కూడా మధ్యాహ్నం వరకు వస్తుందట. కాగా ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్‌ ఫలితాలు మాత్రం రేపు సాయంత్రం 6 గంటల తర్వాత రానున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: