టిడిపి: జెండాలో కనిపించే నాగలి రూపకర్త ఇకలేరు..!

Divya
టిడిపి పార్టీ నందమూరి తారక రామారావు స్థాపించినప్పటికీ అందులో చాలామంది ఆయనకు వెన్ను దండుగా ఉండి ముందుకు నడిపించిన నేతలు చాలామంది ఉన్నారు. అయితే నెమ్మదిగా చంద్రబాబు నాయుడు టిడిపి పార్టీని వశం చేసుకొని ప్రస్తుతం కొనసాగిస్తూ ఉన్నారు. టిడిపి జెండాని చాలామంది స్థాపించింది ఎవరు అంటే కచ్చితంగా సీనియర్ ఎన్టీఆర్ నందమూరి తారకరామారావు పేరే చెబుతారు. అయితే ఆ జెండాలోని నాగలి గుర్తుని ప్రవేశపెట్టింది ఎవరు అంటే మాత్రం చాలామందికి తెలియకపోవచ్చు. ఆయన ఎవరో కాదు టిడిపి సీనియర్ నేత నాగలి రామకృష్ణారెడ్డి..

అయితే ఇటీవలే కొన్ని గంటల క్రితం ఆయన మృతి చెందినట్లుగా తెలుస్తోంది.దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయన మృతికి సంతాపం తెలియజేశారు. అలాగే ఆయన కుటుంబ సభ్యులకు కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు చంద్రబాబు నాయుడు.. వీరితో పాటు పలువురు నేతలు కూడా వారి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్లినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా టిడిపి పార్టీని స్థాపించినప్పటి నుంచి రామకృష్ణారెడ్డి అందించిన సేవలను టిడిపి నేతలు సైతం గుర్తు చేసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలోని చంద్రబాబు మాట్లాడుతూ రామకృష్ణారెడ్డి మృతి చాలా బాధాకరమని ఆవేదన తెలియజేశారు. తెలుగుదేశం జెండాలో నాగలి భాగమై ఎన్టీఆర్ హయాం నుండి ఇప్పటివరకు జరిగిన ప్రతి మహానాడు సభలో నాగలిని  బహూకరిస్తూ నాగలి రామకృష్ణారెడ్డిగా చాలా పేరు సంపాదించారని తెలియజేశారు. అలాగే రామకృష్ణారెడ్డి ఆత్మకు శాంతి కలగాలని తెలియజేశారు చంద్రబాబు. ముఖ్యంగా ఆయన కుటుంబ సభ్యులకు ఎలాంటి సహాయం కావాలన్నా కూడా టిడిపి పార్టీ ఎప్పుడు అండగానే ఉంటుంది అంటే తెలియజేశారు. ముఖ్యంగా అక్కడి నేతలతో టచ్ లో ఉండమని సలహా ఇచ్చినట్లుగా సమాచారం.ప్రస్తుతం టిడిపి కార్యకర్తలు ఆయన అభిమానుల సైతం ఈయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. ఇటీవలే ఎన్నికలు ముగిసి ఇప్పటికీ 17 రోజులు పైనే కలవస్తోంది ఇక రిజల్ట్స్ వచ్చే నెల నాలుగవ తేదీన తెలియబోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: