GOAT: హిట్టు కోసం AI ని తెగ వాడేస్తున్నారుగా?

Purushottham Vinay
తమిళ స్టార్ హీరో తలపతి విజయ్ హీరోగా స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ GOAT. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనేది ఈ టైటిల్ యొక్క మీనింగ్. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో వెంకట్ ప్రభు ఈ మూవీని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించే పనిలో ఉన్నారు.మీనాక్షి చౌదరి ఈ మూవీలో విజయ్ కి జోడీగా కనిపించబోతోందట. ఇదిలా ఉంటే ఈ మూవీలో విజయ్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడని ఇప్పటికే క్లారిటీ వచ్చింది. ఇందులో ఒక క్యారెక్టర్ లో టీనేజ్ యువకుడిగా కూడా విజయ్ ని చూపించబోతున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఈ క్యారెక్టర్ కోసం సరికొత్త టెక్నాలజీ కూడా వాడి లుక్స్ పరంగా వేరియేషన్ తీసుకొచ్చారంట. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమా రెడీ అవుతోంది. దళపతి విజయ్ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని GOAT సినిమా చేస్తున్నారు. ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకొచ్చింది. ఈ మూవీలో మరో ఆసక్తికరమైన పాత్రలో కూడా హీరో విజయ్ కనిపించబోతున్నాడట. ఈ క్యారెక్టర్ ని రివీల్ చేయకుండా ప్రేక్షకులకి సర్ప్రైజ్ ఇవ్వడం కోసం డైరెక్టర్ వెంకట్ ప్రభు సీక్రెట్ గా ఉంచారట.


ఈ మూవీలో ఆ రోల్ కి చాలా ప్రత్యేకత ఉంటుందట. ఈ న్యూస్ ని బట్టి GOAT లో దళపతి విజయ్ నుంచి ట్రిపుల్ ట్రీట్ ప్రేక్షకులకి అందనుందనే మాట కూడా వినిపిస్తోంది. అంటే మూడు విభిన్నమైన లుక్స్ తో విజయ్ ఆకట్టుకోబోతున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఈ ఏడాదిలోనే GOAT సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాత విజయ్ మరొక్క సినిమా మాత్రమే చేయనున్నాడు. ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే విజయ్ రాజకీయ పార్టీని స్థాపించి తమిళ రాజకీయాలలో కీలక భూమిక పోషించడానికి రెడీ అవుతున్నాడు. మరొక్క మూవీ పూర్తి చేసి పూర్తి స్థాయిలో రాజకీయాలపై ఫోకస్ చేయనున్నారు.రెండేళ్ల తర్వాత తమిళనాడులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా విజయ్ రెడీ అవుతున్నారు. రాజకీయాలలోకి రావడంతో సినిమాలు పూర్తిగా మానేస్తున్నట్లు హీరో విజయ్ ప్రకటించాడు. ఈ కారణంగానే GOAT సినిమా పైన ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఈ మూవీతో పాటు రాబోయే సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఫ్యాన్స్ కి గొప్ప ట్రీట్ లా ఉంటుందని విజయ్ అభిమానులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: