జగన్: కుల రాజకీయాల వల్ల సినీ ఇండస్ట్రీని దూరం పెట్టారా..?

Divya
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సినిమా వాళ్లకు నచ్చరా అంటే ఎన్నో రకాల వార్తలు వినిపిస్తూ ఉంటాయి.. ముఖ్యంగా సినిమా టికెట్ల ధరల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సానుకూలంగా లేదనే వార్తలు కూడా ఎన్నోసార్లు వినిపించాయి.. ఇలాంటి వార్తల పైన ప్రముఖ తెలుగు కవి సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు పలు విషయాలను వెల్లడించారు.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి సినిమా పరిశ్రమకు దాదాపుగా 60 శాతం వరకు రెవెన్యూ వస్తుంది అంటూ వెల్లడించారు.

అంత వస్తున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా షూటింగులు జరపరని.. పవన్ కళ్యాణ్ వంటి వారు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లి జనసేన పార్టీ పెట్టి.. పోటీ చేస్తున్నారు .నందమూరి బాలకృష్ణ టిడిపి తరఫున రెండుసార్లుగా ఎమ్మెల్యే అయ్యారు మూడవసారి అదృష్టాన్ని పరీక్షించబోతున్నారు.. సినీ పరిశ్రమలోనే ఉంటున్న వీరందరితోపాటు మిగతావారు కూడా ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ పరిశ్రమలు తీసుకోవచ్చారంటూ ప్రశ్నిస్తున్నారు.. ఈ విషయం మంచిదే అయినప్పటికీ ముఖ్యంగా మీరున్న పరిశ్రమ ఎందుకు ఆంధ్రప్రదేశ్కు తీసుకువెళ్లడం లేదంటూ ఈయన ప్రశ్నించారు.

పవన్ కళ్యాణ్ ఏదో ఒక సందర్భంలో తనకు రోజుకు రెండు కోట్ల రూపాయల పారితోషకం వస్తుంది అంటూ చెప్పారు..అంటే ఇందులో 60 శాతం ఏపీ నుంచి వస్తుంది కదా అంటూ ఒక సినిమాలో నటిస్తే ఏపీ నుంచి మీకు కోటి 60 లక్షల రూపాయలు వస్తాయన్నమాట.. లాభాలు వస్తాయనే కదా నిర్మాతలు మీకు అంత డబ్బులు ఇస్తున్నారు. ఇన్ని కోట్ల ప్రజలు మీకు నీరాజనాలు పలుకుతున్నారు.. ఏపీ ప్రజల అభిమానం అయితే కావాలి 60 శాతం రెవెన్యూ అయితే కావాలి.. మీరు పరిశ్రమ అక్కడ ఎందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేయలేదని ప్రశ్నిస్తున్నారు

50% వరకు షూటింగ్లో ఏపీలో జరిపితే కచ్చితంగా సినిమాలకు ప్రోత్సాహం ఉంటుంది అంటూ జగన్మోహన్ రెడ్డి ఎన్నో సందర్భాలలో తెలిపారు. కానీ మీరు ఎక్కడా కూడా షూటింగ్ ఆంధ్రప్రదేశ్లో జరపలేదు.. మహా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అంటూ సింగపూర్ అమెరికా వాడిని బ్రతిమాలాల.. మన దగ్గర భూమి నీరు ఉన్నాయి 50% వరకు ఆంధ్రాలో షూటింగ్ జరిపితే చాలు కదా అంటూ తెలిపారు ఈ విషయాన్ని హీరోని నిర్మాతల దగ్గర చెబితే వారు కాదంటారా అంటూ తెలియజేశారు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు.. తెలంగాణలో చాలానే ఇండస్ట్రీలు ఉన్నాయి.. ఇందులో కొంత భాగమైన ఆంధ్రప్రదేశ్లో పెడితే అక్కడ భూమి కూడా ఇస్తామన్నారు బ్రహ్మాండంగా నిర్మించవచ్చు.. ఫిలిం  ఇన్స్టిట్యూట్ వంటివి నిర్మించవచ్చు కేవలం అగ్రకులాల వారి హీరోలు కావాలా ఇతరులు కాకూడదు అనే ఉద్దేశంతోనే వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తోంది. అందుకే సినిమా సెలబ్రిటీలు అంటే జగన్ కి నచ్చి ఉండకపోవచ్చు అన్నట్లుగా తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: