పిఠాపురం: జనసేనాని భారీ మెజారిటీతో నెగ్గుతారంటారా?

Purushottham Vinay
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిశాయి. ప్రస్తుతం అందరి దృష్టీ జూన్ 4 న వెలువడబోతోన్న ఫలితాలపైనే ఉందనేది అందరికి విషయమే. ఈ గ్యాప్ లో పలు రకాల విశ్లేషణలు, అంచనాలు, అభిప్రాయాలు ఇంకా ఎగ్జిట్ పోల్ అనాలసిస్ లు మొదలైనవి ఏపీ రాజకీయాల్లో హల్ చల్ చేస్తున్నాయి.ఈ క్రమంలో పిఠాపురంలో పవన్ గెలుపుపై చాలా మంది రాజకీయ విశ్లేషకులు ఇంకా మీడియా సంస్థలు ఆసక్తికరంగా స్పందించడం జరిగింది.ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం ఎంత హాట్ టాపిక్ గా మారింది అనేది అందరికి తెలిసిన విషయమే. ఆ స్థానం నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేయడం.. ఎన్నికల ప్రచారం చివరి రోజు చివరి మీటింగ్ ను పిఠాపురంలో నిర్వహించిన జగన్ మోహన్ రెడ్డి వైసీపీ అభ్యర్థి వంగ గీతను గెలిపిస్తే ఉపముఖ్యమంత్రిని చేసి పక్కన కుర్చోబెట్టుకుంటానని ప్రకటించారు.దీంతో... పిఠాపురం రాజకీయం అంతా కూడా ఒక్కసారిగా వేడెక్కింది. అప్పటి దాకా పవన్ కళ్యాణ్ కు కాస్త ఎడ్జ్ ఉందంటూ వినిపించిన మాటల నడుమ... ఫైట్ టైట్ అయ్యిందనే వార్తలు కూడా తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో పిఠాపురంలో ఎవరు గెలుస్తారనే విషయంపై ఎంతో తీవ్రమైన తీవ్ర చర్చ నడిచింది.

ఈ సమయంలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపును కొంతమంది కన్ఫర్మ్ చేస్తే కొంతమంది మాత్రం వంగ గీత గెలుస్తుందని నమ్ముతున్నారు. ముఖ్యంగా పవన్ మెజారిటీ ఎంతనే విషయంపైనే చర్చ, బెట్టింగులు భారీగా నడుస్తున్నట్లుగా ఇండియా హెరాల్డ్ కి సమాచారం తెలుస్తుంది. పైగా.. ఆంధ్రప్రదేశ్ లో కూటమి జతకట్టడానికి కారణం తానే అని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ రేపు కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వస్తే ఏపీ ప్రయోజనాలా విషయంలో ఆయన పాత్ర కీలకమని తెలుస్తుంది.ప్రజల సమస్యలపై పవన్ స్పందించే విషయం కాని ఇంకా ప్రజా సమస్యలను పరిష్కరించాలనే విషయం ఆయన ధోరణి కానీ.. అలాంటి వ్యక్తులు ఖచ్చితంగా అసెంబ్లీలో ఉండాల్సిన అవసరం ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఫలితంగా రాష్ట్రం ముందుకు వెళ్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఫలితంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తారని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు.అయితే పవన్ కి పోటీగా వైసీపీ గీతని రంగంలోకి దింపడమే కాకుండా డెప్యూటీ సీఎంని చేస్తానని అనడంతో జనాలు వైసీపీ మీద కూడా పాజిటివ్ గా ఉన్నారు. పైగా అక్కడ ఎక్కువ పేదవాళ్లు ఉండటం వలన వైసీపీకి ఓట్లు పడే ఛాన్స్ ఉంది. మరి చూడాలి ఏమవుతుందో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: