ఎన్టీఆర్ జయంతి: ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన మనవళ్ళు..!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో సీనియర్ నటుడుగా నందమూరి తారక రామారావు ఎంత గొప్ప పేరు సంపాదించుకున్నారో చెప్పాల్సిన పనిలేదు.. అలాగే పొలిటికల్ పరంగా కూడా ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే సీఎం హోదాని సంపాదించారు.. టిడిపి పార్టీని స్థాపించింది కూడా నందమూరి తారక రామారావు.. ఈ రోజున 101 వ జయంతి సందర్భంగా ఆయన మనవళ్ళు జూనియర్ ఎన్టీఆర్ ,కళ్యాణ్ రామ్ ఇద్దరు కూడా హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ అభిమానులు నందమూరి అభిమానుల సైతం అక్కడికి పెద్ద ఎత్తున వచ్చారు.

నటుడుగా నాయకుడిగా నందమూరి తారక రామారావు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఎలాంటి పాత్రలోనైనా సరే ఒదిగిపోయి మరి నటిస్తూ ఉండేవారు. ఒక శకాన్ని సృష్టించిన యుగపురుషుడిగా కూడా ఎన్టీఆర్ పేరు సంపాదించారు. ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలలో ఘనంగా ఎన్టీఆర్ జయంతిని నిర్వహించనున్నారు. ప్రతి ఏటా కూడా టీడీపీ మహానాడు వంటి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేసేవారు. అయితే ఈ ఏడాది ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో పార్టీ అధిష్టానం ఈ మహానాడు ను వాయిదా వేసినట్లుగా సమాచారం.

అలాగే ఎన్నికల కోడ్ ఉన్నందువలన విగ్రహాలకు కూడా ముసుగులు వేయడంతో పలు ప్రాంతాలలో గ్రామాలలో కూడా ఇలాంటివి నిర్వహించవద్దు అంటూ రద్దు చేశారు. ఈ రోజున ఎన్టీఆర్ జయంతి పెద్దగా ఆర్భాటం లేకుండా కొనసాగిస్తున్నట్లు కనిపిస్తోంది. ఏది ఏమైనా జూనియర్ ఎన్టీఆర్ కూడా టిడిపి పార్టీ పగ్గాలు చేపట్టాలని అభిమానులు అయితే చాలా బలంగా కోరుకుంటున్నారు.. కానీ ఎన్టీఆర్ మాత్రం రాజకీయాలంటే ఇష్టం లేదనే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికే టిడిపి పార్టీలో ఉండే చాలామంది నేతలు ఎన్టీఆర్ కు సపోర్టు చేస్తూ ఉన్నారు.. మరి కొంతమంది లోకేష్ ని చేయాలని చూస్తూ ఉన్నట్లుగా కనిపిస్తోంది. మరి రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ టిడిపి పగ్గాలు చేపడతారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: