ఏపీ: ఈ లెక్క చూస్తే పక్కా మళ్ళీ జగనే సీఎం..?

Purushottham Vinay
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 21 లోక్‌సభ స్థానాల్లో విజేతలను నిర్ణయించేది మహిళా ఓటర్లేనని స్పష్టమైంది. ఈ నెల 13న జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాలకు గాను ఏకంగా 21 స్థానాల్లో పురుషులు కన్నా మహిళలే ఎక్కువగా ఓటేశారని కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్‌ గణాంకాలు స్పష్టంగా పేర్కొన్నాయి. అమలాపురం, ఒంగోలు, కర్నూలు ఇంకా హిందూపురం లోక్‌సభ స్థానాల్లో మాత్రమే మహిళలు కన్నా పురుషులు కాస్త ఎక్కువగా ఓటేశారు. కాకినాడ, అనంతపురం లోక్‌సభ స్థానాల్లో అయితే పురుషులు కన్నా మహిళలే ఎక్కువగా ఓటేసినా.. తేడా మాత్రం స్వల్పంగానే ఉన్నట్లు తెలుస్తుంది.ఇక మిగతా లోక్‌సభ స్థానాల్లో 11 వేల నుంచి 47 వేల దాకా మహిళల ఓట్లు ఎక్కువ ఉన్నాయి. మహిళా ఓట్లు ఎక్కువగా నమోదయ్యాయంటే సహజంగానే వైసీపీ కే మొగ్గు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఐదేళ్ల పాలనలో మహిళల కోసం చాలా రకాల మంచి పథకాలను అమలు చేయడమే కాకుండా వారి జీవనోపాధిని కూడా మెరుగుపరిచారు. అదే గెలుపుకి కారణమని ఇండియా హెరాల్డ్ సర్వేలో తేలింది.


కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మహిళల పేరిట పథకాలు మంజూరు చేయడంతో మహిళా ఓటింగ్‌ పెరిగిందని ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదిక స్పష్టం చేసిన సంగతి కూడా తెలిసిందే.రాష్ట్రంలోని మహిళలందరూ కూడా మళ్లీ వైఎస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలనే గట్టి పట్టుదలతో పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి ఓటు వేశారని సీనియర్‌ రాజకీయ నాయకులు కామెంట్స్ చేస్తున్నారు. మహిళల ఓట్లు ఎక్కువగా నమోదైన 21 పార్లమెంట్‌ నియోజకవర్గాలతో పాటు ఆ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో మహిళల ఓట్లన్నీ వైసీపీకే పడ్డాయని, పోలింగ్‌ రోజున ఇది స్పష్టంగా కనిపించిందని ఆ రాజకీయ నాయకులు చెబుతున్నారు.హైదరాబాద్‌ అపార్ట్‌మెంట్లలో ఇస్త్రీ పనికి వెళ్లిన వారితో పాటు వివిధ రకాల చిన్న చిన్న పనులు చేసుకునేందుకు వెళ్లిన మహిళలందరూ కూడా ఏపీ వెళ్లి వైసీపీకే ఓటు వేశామని చెబుతున్నారు. ప్రభుత్వం వల్ల మేలు పొందిన వారందరూ కూడా ఎక్కడున్నా సరే పోలింగ్‌ రోజున రాష్ట్రానికి వచ్చి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో వైసీపీకే ఓటు వేశారని ఇండియా హెరాల్డ్ సర్వేలో తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: